SAIL: సెయిల్‌లో సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు
ఒడిశా రాష్ట్రం రూర్కెలాలోని స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఒడిశా రాష్ట్రం రూర్కెలాలోని స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్/ సీనియర్ మెడికల్ ఆఫీసర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 11.
పోస్టుల కేటాయింపు: జనరల్(యూఆర్)-07, ఓబీసీ-03, ఎస్సీ-01.
➥ సీనియర్ కన్సల్టెంట్ (E-4): 03 పోస్టులు
విభాగాలు: ప్లాస్టిక్ సర్జరీ-01, న్యూరోసర్జరీ-01, గ్యాస్ట్రోఎంటరాలజీ-01.
అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్/ నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఎంసీహెచ్/డీఎం ప్లాస్టిక్ సర్జరీ/న్యూరోసర్జరీ/గ్యాస్ట్రోఎంటరాలజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18.01.2024 నాటికి 44 సంవత్సరాలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 38 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.90,000–3%– రూ.2,40,000 వరకు ఇస్తారు. సీటీసీ రూ.27.1 లక్షలుగా ఉంటుంది.
➥ కన్సల్టెంట్ (ఇ-3)/ సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఇ-2): 07 పోస్టులు
విభాగాలు: ఆర్థోపెడిక్స్-01, ఆప్తాల్మాలజీ-01, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ-01, అనస్తీషియా-01, పల్మొనరీ మెడిసిన్-01, ఈఎన్‌టీ-01, మెడిసిన్-01.
అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్/ నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)/ డీఎన్‌బీ (ఆర్థోపెడిక్స్/ ఆప్తాల్మాలజీ/అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ/ అనస్తీషియా/ పల్మొనరీ మెడిసిన్/ఈఎన్‌టీ/మెడిసిన్ అర్హత ఉండాలి. కన్సల్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18.01.2024 కన్సల్టెంట్ పోస్టులకు 41 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.80,000–3%– రూ.2,20,000 వరకు ఇస్తారు. సీటీసీ రూ.24.4 లక్షలుగా ఉంటుంది.
➥ మేనేజర్(ఇ-3): 01 పోస్టు
విభాగం: హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు 60 శాతం మార్కులతో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18.01.2024 నాటికి 41 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.70,000–3%– రూ.2,00,000 వరకు ఇస్తారు. సీటీసీ రూ.21.8 లక్షలుగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. అయితే మేనేజర్ పోస్టులకు మాత్రం రాతపరీక్ష (సీబీటీ), ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
DY. GENERAL MANAGER (PL-TA, G & GA)
BLOCK “E”, GROUND FLOOR
ADMINISTRATION BUILDING
ROURKELA STEEL PLANT
ROURKELA - 769 011 (ODISHA)
ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 13.01.2024. (11.45 PM)
* దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 18.01.2024.
ALSO READ:
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 85 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- జీఐసీఆర్ఈ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..