NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
కోల్ ఇండియా ఆధ్వర్యంలోని నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NCL Recruitment: కోల్ ఇండియా ఆధ్వర్యంలోని నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 34 సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
వివరాలు..
➥ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 34
పోస్టుల కేటాయింపు: యూఆర్-10, ఈడబ్ల్యూఎస్-02, ఎస్సీ-08, ఎస్టీ-03, ఓబీసీ-11.
➥ సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
➥ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
➥ సీనియర్ మెడికల్ పోస్టులు
విభాగాలు: సర్జన్, జనరల్ ఫిజీషియన్/మెడిసిన్, గైనకాలజీ & అబ్‌స్టేట్రిక్స్, అనస్థిసిస్ట్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మాలజిస్ట్, చెస్ట్ స్పెషలిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్, జీడీఎంఓ, డెంటిస్ట్.
అర్హతలు..
➥ సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ & పల్మొనరీ మెడిసిన్ విభాగాలకు ఎంబీబీఎస్‌తోపాటు పీజీ డిగ్రీ/డీఎన్‌బీ అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇతర స్పెషాలిటీలకు కనీసం పీజీ డిప్లొమా ఉండాలి.
➥ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ & పల్మొనరీ మెడిసిన్ విభాగాలకు ఎంబీబీఎస్‌తోపాటు పీజీ డిగ్రీ/డీఎన్‌బీ అర్హత ఉండాలి. ఇతర స్పెషాలిటీలకు కనీసం పీజీ డిప్లొమా ఉండాలి.
➥ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఎంబీబీఎస్ లేదా బీడీఎస్‌తోపాటు తగినంత అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి సీనియర్ మెడికల్ స్పెషిస్ట్ పోస్టులకు 42 సంవత్సరాలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్/ సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్)/ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
జీతం..
* సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు రూ.70,000-2,00,000.
* మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ. 60,000 - 1,80,000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of Dy. General Manager (Personnel/Recruitment),
Recruitment Department,
NCL HQ, Singrauli (M.P.),
Pin Code- 486889.
దరఖాస్తు చివరితేదీ: 11.04.2024.
ALSO READ:
కాటన్ యూనివర్సిటీలో 167 టీచింగ్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి
గువాహటిలోని కాటన్ యూనివర్సిటీ రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 167 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. యూజీసీ నిబంధనల మేరకు విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల కాపీలను ఈమెయిల్ లేదా సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఇతర అర్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..