(Source: ECI/ABP News/ABP Majha)
NLC Apprentices: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 632 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
NLC India Apprentices Notification: తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
NLC India Limited Notification: తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 632 గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 632
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 314 పోస్టులు
మెకానికల్ ఇంజినీరింగ్: 75 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 78 పోస్టులు
సివిల్ ఇంజినీరింగ్: 27 పోస్టులు
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
కెమికల్ ఇంజినీరింగ్: 09 పోస్టులు
మైనింగ్ ఇంజినీరింగ్: 44 పోస్టులు
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 47 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 05 పోస్టులు
ఫార్మసీ: 14 పోస్టులు
* టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 318 పోస్టులు
మెకానికల్ ఇంజినీరింగ్: 95 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 94 పోస్టులు
సివిల్ ఇంజినీరింగ్: 49 పోస్టులు
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 09 పోస్టులు
మైనింగ్ ఇంజినీరింగ్: 25 పోస్టులు
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 38 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2019/2020/2021/2022 & 2023లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పూర్తి చేసి ఉండకూడదు. అభ్యర్థులు NLCIL లేదా మరెక్కడైనా అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొంది ఉండకూడదు లేదా ప్రస్తుతం శిక్షణ పొంది ఉండకూడదు. అభ్యర్థులకు ఏ ఉద్యోగంలోనూ ఏడాది లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉండకూడదు. అభ్యర్థులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్నాటక మరియు పాండిచ్చేరి మరియు లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారై ఉండాలి.
వయోపరిమితి: అప్రెంటీస్‌షిప్ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.15028; టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.12524.
దరఖాస్తు హార్డుకాపీలు పంపాల్పిన చిరునామా:
The General Manager,
Learning and Development Centre,
N.L.C India Limited.
Neyveli – 607 803.
దరఖాస్తుకు జతపరచాల్సిన సర్టిఫికెట్లు..
➤ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్.
➤ కమ్యూనిటీ సర్టిఫికేట్ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌కి చెందినవారైతే)
➤ డిగ్రీ సర్టిఫికెట్లు / డిప్లొమా సర్టిఫికేట్ / ప్రొవిజనల్ సర్టిఫికేట్
➤ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ (లేదా) సెమిస్టర్ - రెండు వైపులా మార్క్ షీట్.
➤ దివ్యాంగులకు ద్రువీకరణ పత్రం
➤ ఎక్స్- సర్వీస్‌మెన్ ద్రువీకరణ పత్రం
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2024.
➥ అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 19.02.2024.
➥ అప్రెంటిస్‌షిప్ ప్రవేశ తేదీలు: 23.02.2024 నుంచి 29.02.2024 వరకు.
ALSO READ:
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..