(Source: ECI/ABP News/ABP Majha)
KVS Jobs Application: 'కేంద్రీయ' ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దరఖాస్తు గడువును 2023, జనవరి 2 వరకు పొడిగిస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. చివరితేది మాాత్రమే మారిందని.. ఇతర వివరాల్లో ఎలాంటి మార్పు లేదిని కేవీఎస్ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు చివరితేదీని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26తో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే దరఖాస్తు గడువును 2023, జనవరి 2 వరకు పొడిగిస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చివరితేది మాాత్రమే మారిందని.. అభ్యర్థుల అర్హతలు, వయోపరిమితి, అనుభవం తదితర వివరాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని కేవీఎస్ తెలిపింది.
మాక్ టెస్టులు అందుబాటులో...
కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లను కేంద్రీయ విద్యాలయ సంగతన్ అందుబాటులోకి తెచ్చింది. కేవీల్లో ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు రూల్ నెంబర్; పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మాక్ టెస్టులో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
మాక్‌టెస్ట్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఖాళీల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంగతన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ డిప్లొమా/బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్‌సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్నవారికి వయోపరిమితి విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.2300లు, పీఆర్టీ/టీజీటీ/పీజీటీ/ఫైనాన్స్ ఆఫీసర్/ఏఈ/లైబ్రేరియన్/ఏఎస్‌ఓ/హెచ్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022. (02.01.2023 వరకు పొడిగించారు)
➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
Also Read:
కానిస్టేబుల్ పోస్టుల 'అప్లికేషన్ స్టేటస్' వచ్చేసింది! చెక్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయ్ పోస్టుల భర్తీకి సంబంధించిన 'అప్లికేషన్ స్టేటస్' లింక్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్టివేట్ చేసింది. అయితే ప్రస్తుతానికి సౌత్ రీజియన్, కర్ణాటక-కేరళ రీజియన్లకు సంబంధించిన లింక్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. త్వరలోనే రీజియన్ల వారీగా అన్ని రీజినల్ వెబ్‌సైట్లలో పెట్టనుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ స్టేటస్ వివరాలు తెలుసుకోవడానికి క్లిక్ చేయండి..
Nursing Jobs: జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి!
జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాలపై ఆసక్తి, అర్హత ఉన్న తెలంగాణ అభ్యర్థుల నుంచి రాష్ట్ర విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్) దరఖాస్తులు కోరుతోంది. వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ ద్వారా విదేశీ ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం మొదటి విడత ఎంపిక పూర్తికాగా.. డిసెంబర్ 27 నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..