Job Mela: కాకినాడలో 719 ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా! జులై 21న ఇంటర్వ్యూలు
Kakinada District Job Mela : ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డీఆర్డీఏ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో జులై 21న ఉద్యోగమేళా నిర్వహించనున్నారు.
Kakinada District Job Mela : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డీఆర్డీఏ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో జులై 21న ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఉద్యోగ మేళా జరుగనుంది. ఈ జాబ్ మేళాలో మొత్తం 12 ఎంఎన్‌సీ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ యువతీ, యువకులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీలోని పిఠాపురం, కాకినాడ, అన్నవరం, రాజమండ్రి, ఏలేశ్వరం, కడప,తణుకు, తాడేపల్లిగూడెం, సత్యవేడు, అనంతపురం, పరవాడ, శ్రీ సిటీ, తడ, తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, మంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
వివరాలు..
* జాబ్ మేళా
మొత్తం పోస్టుల సంఖ్య: 719.
కంపెనీ, పోస్టుల వివరాలు..
➥ వరుణ్ మోటార్స్: డ్రైవర్, క్యాషియర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్.
➥ వైఎస్‌కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్: టెక్నీషియన్, అసిస్టెంట్ టెక్నీషియన్, వెల్డర్, గ్యాస్ వెల్డర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్, ఐటీ రిక్రూటర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్.
➥ ముత్తూట్ ఫైనాన్స్: ఇంటర్న్‌షిప్, జూనియర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్.
➥ అపోలో ఫార్మసీ: రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసిస్ట్
➥ క్వెస్ కార్ప్ లిమిటెడ్: బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్, రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్.
➥ వీల్స్ ఇండియా లిమిటెడ్:మ్యాచింగ్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, క్వాలిటీ, మెయింటెనెన్స్
➥ కోజెంట్ ఇ సేవలు: బీపీవో
➥ అపోలో టైర్స్: ప్రొడక్షన్ ఆపరేటర్
➥ పేటీఎం: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
➥ ఈకామ్ ఎక్స్‌ప్రెస్: డెలివరీ అసోసియేట్
➥ అరబిందో ఫార్మా: ప్రొడక్షన్ అసిస్టెంట్
అర్హత: పోస్టులవారీగా 5వ తరగతి, పదోతరగతి, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: ఖాళీని అనుసరించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: ఎంపికైనవారికి నెలకు రూ.10,000 - రూ.20,000 వరకు ఇస్తారు.
వాక్-ఇన్ డ్రైవ్ తేదీ: 21.07.2023.
డ్రైవ్ నిర్వహణ వేదిక: Government Polytechnic College, Opposite MPDO Office, Pithapuram, Kakinada.
ALSO READ:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial