News
News
X

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!

దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

FOLLOW US: 

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్‌, ప్యారామీటర్స్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

వివరాలు..

* అప్రెంటిస్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1535

News Reels

I. ట్రేడ్ అప్రెంటిస్

అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) ఖాళీలు: 396

ఫిట్టర్ ఖాళీలు: 161

బాయిలర్ ఖాళీలు: 54

సెక్రటేరియల్ అసిస్టెంట్ ఖాళీలు: 39

అకౌంటెంట్ ఖాళీలు: 45

డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు: 73

II. టెక్నీషియన్ అప్రెంటిస్

కెమిస్ట్రీ ఖాళీలు: 332

మెకానికల్ ఖాళీలు: 163

ఎలక్ట్రికల్ ఖాళీలు: 198

ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఖాళీలు: 74


విభాగాలు: ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, ఫిట్టర్, కెమికల్, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, అకౌంట్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏ/బీఎస్సీ/బీకాం/ఇంటర్మీడియట్‌/ఐటీఐ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 30.09.2022 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్‌, ప్యారామీటర్స్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి ప్రతి నెలా స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఎంపికైనవారు విధిగా గౌహతి, డిగ్‌బోయి, బొంగైగావ్ (అస్సాం), బరౌని (బీహార్), వడోదర (గుజరాత్), హల్దియా (పశ్చిమ బెంగాల్), మధుర (UP), పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్ (హర్యానా), పారాదీప్ (ఒడిశా) ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. 


ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.09.2022.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23.10.2022.

* అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ తేదీ: 01.11.2022 - 05.11.2022 వరకు.

* రాత పరీక్ష తేదీ: 06.11.2022.

* ఫలితాల ప్రకటన తేదీ: 21.11.2022.

* డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ తేదీలు:  28.11.2022 -  07.12.2022.


Notification

Online Application

Website

 

ఇవి కూడా చదవండి..

UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

UPSC: యూపీఎస్సీ నుంచి 54 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు ఇవే!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 43 లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు, సైంటిస్ట్ ‘బి’ (ఫోరెన్సిక్ డీఎన్‌ఏ) విభాగంలో 6 పోస్టులు, ఇతర విభాగాల్లో ఒక్కో పోస్టుల చొప్పున భర్తీ చేస్తారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 26 Sep 2022 08:22 AM (IST) Tags: IOCL Apprentice Recruitment 2022 Indian Oil Corporation IOCL Recruitment 2022 Apply Online for IOCL Recruitment Indian Oil Corporation Limited Recruitment

సంబంధిత కథనాలు

Telanagana Jobs: మరో గుడ్ న్యూస్, 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు ఇవే!!

Telanagana Jobs: మరో గుడ్ న్యూస్, 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు ఇవే!!

AP Police Jobs: 6,511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేస్తోంది!! వివరాలు ఇలా!

AP Police Jobs: 6,511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేస్తోంది!! వివరాలు ఇలా!

TSPSC Group 4 Notification: తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

TSPSC Group 4 Notification: తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168  పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

ITBP Constable Recruitment: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

ITBP Constable Recruitment: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

UPSC CSE Mains Result 2022: త్వరలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు! రిజల్ట్ తర్వాత ఇవి తప్పనిసరి!

UPSC CSE Mains Result 2022: త్వరలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు! రిజల్ట్ తర్వాత ఇవి తప్పనిసరి!

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!