అన్వేషించండి

Indian Army: డిగ్రీ అర్హతతో 'ఆర్మీ'లో ఆఫీసర్ పోస్టులు - NCC స్పెష‌ల్ ఎంట్రీ నోటిఫికేషన్ విడుదల

NCC Special Entry Scheme: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. వచ్చే ఏడాది అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సు ద్వారా నియామకాలు చేపట్టనున్నారు.

Indian Army NCC Special Entry Scheme: ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 58వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2025 అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

➥ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (58వ కోర్సు)(అక్టోబర్‌ 2025) -  షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లు

* మొత్తం ఖాళీలు: 76

1) ఎన్‌సీసీ (మెన్): 70 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ కేటగిరీ-63, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-07.

2)  ఎన్‌సీసీ (ఉమెన్): 06 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ కేటగిరీ-05, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-01.

అర్హతలు..

✦ కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎన్‌సీసీ‌ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వీరికి ఎన్‌సీసీ సర్టిఫికెట్ అవసరం లేదు. 

✦ మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్‌లో కనీసం బి-గ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్‌ అవసరం లేదు. 


వయోపరిమితి: 01.07.2025 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.2000 - 01.07.2006 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుంది.  స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు ఉంటాయి. స్టేజ్-1లో ఫెయిల్ అయిన అభ్యర్థులను స్టేజ్-2కి ఎంపిక చేయరు, వారు అదే రోజు తిరిగివెళ్లొచ్చు. స్టేజ్-1లో ఎంపిక అయిన అభ్యర్థులకు స్టేజ్-2 ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపిక అయిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.

శిక్షణ,స్టైపెండ్ వివరాలు:  ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. నెలకు రూ.56,100 చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోసింగ్ ఇస్తారు. వీరికి 6 నెలలపాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నిర్ణీత పేస్కేలు ప్రకారం ఇతర అలవెన్సులు ఇస్తారు. పనితీరు సక్రమంగా లేకపోయినా, ఆరోగ్య సమస్యలు తలెత్తిన విధుల నుంచి తొలగిస్తారు.

పేస్కేలు ఇలా..


Indian Army: డిగ్రీ అర్హతతో 'ఆర్మీ'లో ఆఫీసర్ పోస్టులు - NCC స్పెష‌ల్ ఎంట్రీ నోటిఫికేషన్ విడుదల

 

 

 

 

 

 

 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.02.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.03.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
Chandrababu:  చంద్రబాబుపై  తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP DesamRohit Sharma 70 Runs vs SRH IPL 2025 | సరైన సమయంలో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ | ABP DesamMumbai Indians top 3 Position IPL 2025 | అనూహ్య రీతిలో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ | ABP DesamIshan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
Chandrababu:  చంద్రబాబుపై  తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
Rajamouli: మహేష్ బాబు సినిమా కోసం... ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
మహేష్ బాబు సినిమా కోసం... ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
Pahalgam attack:భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత
భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత  
Embed widget