By: ABP Desam | Updated at : 07 Aug 2023 12:44 PM (IST)
Edited By: omeprakash
ఐఐటీ బాంబేలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు
IITB JE Notification: ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఎలక్ట్రికల్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా బీఈ, బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 04
* జూనియర్ ఇంజినీర్ పోస్టులు
అర్హతలు: డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా బీఈ, బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు: రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.44900-రూ.142400.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.08.2023.
Notification
ALSO READ:
భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 105 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు
BARC JRF Notification: ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు జూనియర్ రిసెర్చ్ కోసం అర్హత కల్పించే ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4న ప్రారంభంకాగా.. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ నేవీలో 35 ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా ఎగ్జిక్యూటివ్(ఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ ద్వారా ఎంపికచేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో జనవరి 2024 నుంచి స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు ప్రారంభమవుతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
AFMS SSC Medical Officer Recruitment 2023: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన (షార్ట్ నోటిఫికేషన్)ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 585 పోస్టులు, మహిళలకు 65 పోస్టులు కేటాయించారు. ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
IFFCO Notification: ఇఫ్కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
JL Exam Key: జేఎల్ రాత పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్.. జయహో శుభ్‌మన్! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక
మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
/body>