Indian Navy: ఇండియన్ నేవీలో 35 ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా ఎగ్జిక్యూటివ్(ఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా ఎగ్జిక్యూటివ్(ఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ ద్వారా ఎంపికచేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో జనవరి 2024 నుంచి స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు ప్రారంభమవుతుంది.
వివరాలు..
* ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ (ఐటీ): 35 పోస్టులు
అర్హతలు..
➥ పదోతరగతి, ఇంటర్ స్థాయిలో 60 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
➥ ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీ/సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/సైబర్ సెక్యూరిటీ/ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్‌వర్కింగ్/కంప్యూటర్ సిస్టమ్స్ & నెట్‌వర్కింగ్/డేటా అనలిటిక్స్/ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)
(లేదా)
➥ బీసీఏ/బీఎస్సీతోపాటు ఎంసీఏ.
వయోపరిమితి: 02.01.1999 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ వివరాలు: ఎంపికైనవారికి ఎజిమల(కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణనిస్తారు. ఈ సమయంలో నేవల్ షిప్స్,ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అంశాల మీద శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు. శిక్షణ మధ్యలో ఆపేసిన అభ్యర్థులు అప్పటివరకు వారిపై ఖర్చుపెట్టిన మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ప్రొబేషన్ పీరియడ్: ఉద్యోగాల్లో చేరినవారికి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో అభ్యర్థుల వ్యక్తిగత ప్రవర్తన సరిగాలేని పక్షంలో విధుల నుంచి తొలగిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.08.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 20.08.2023.
ALSO READ:
1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇస్రో-సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో 56 ఖాళీలు - ఈ అర్హతలుండాలి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 4న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 24 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.