అన్వేషించండి

SSC JE Recruitment: 1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జేఈ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.

❂ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2023

ఖాళీల సంఖ్య: 1324

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్

విభాగాలవారీగా పోస్టులు:

విభాగం  పోస్టులు పోస్టుల సంఖ్య
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 486
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్) 545
సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్) 211
డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్‌మెంట్ & గంగా రెజువెనేషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్) ప్రకటించలేదు
ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్ట్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 21
మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్) జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 47
నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్  జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 06
మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్) జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) 08

అర్హత‌: 16.08.2023 నాటికి సంబంధిత ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా అభ్యర్థులకు 2-3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. అయితే కొన్ని విభాగాల్లోని పోస్టులకు మాత్రమే అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 

వ‌యోప‌రిమితి: విభాగాల ఆధారంగా అభ్యర్థుల వయోపరిమితి నిర్ణయించారు. 01.08.2023 నాటికి వయోపరిమితిని పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని విభాగాలకు 32 సంవత్సరాలు, మ‌రికొన్నింటికి 30 సంవత్సరాల వరకు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు(జనరల్) 10 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి. డిఫెన్స్ పర్సనల్స్ అభ్యర్థులకు ఎస్సీ-ఎస్టీలకు 8 సంవత్సరాలు, ఇతరులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

పరీక్ష ఫీజు: రూ.100. ఎస్‌బీఐ చలానా, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మహిళా అభ్యర్థులు ఎస్సీ , ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఇప్పటికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనివారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: పేపర్-1,  పేపర్-2  కంప్యూటర్ ఆధారిత పరీక్షలు,  డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష విధానం:

✦ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'‌కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.

✦ పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్) నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు (ప్రత్యేక అవసరాలుగలవారికి 2 గంటల 40 నిమిషాలు). పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 1/3వ వంతు  మార్కులు కోత విధిస్తారు. పేప‌ర్-1లో అర్హత‌ సాధించిన‌వారికి పేప‌ర్-2 ప‌రీక్ష నిర్వహిస్తారు.

✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

జీతం: రూ.35,400-రూ.1,12,400.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.07.2023.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.08.2023. 

.✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: 17.08.2023 - 18.08.2023

✦ పేపర్-1 పరీక్ష (సీబీటీ) తేది: అక్టోబరు, 2023.

Notification

Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Hardik Pandya : తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
Tamil Nadu Crime News: తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Embed widget