IBPS RRB Hall Tickets: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
IBPS RRB Hall Tickets: దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఆర్‌ఆర్‌బీ సీఆర్‌పీ-XII అడ్మిట్ కార్డులను ఐబీపీఎస్ విడుదల చేసింది.
IBPS RRB Hall Tickets: దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ రాతపరీక్ష (ఆర్‌ఆర్‌బీ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII(సీఆర్‌పీ)) )అడ్మిట్ కార్డులను 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) జులై 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 6 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
అడ్మిట్‌కార్డ్‌ల కోసం క్లిక్ చేయండి.
ఐబీపీఎస్ పరీక్షల క్యాలెండర్ ప్రకారం.. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు ఆగస్టు 5, 6, 12, 13,19 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్-2, ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు సెప్టెంబరు 9న (సింగిల్ ఎగ్జామ్) పరీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 10న, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సెప్టెంబరు 16న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
దేశంలోని వివిధ గ్రామీణ బ్యాంకుల్లో 9,053 గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్‌లో మెయిన్స్ జరుగనున్నాయి.
పరీక్ష విధానం:
Also Read:
'క్లర్క్' ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా 4,545 ఖాళీలను భర్తీచేయనుంది. అయితే క్లర్క్ పోస్టులకు దరఖాస్తు గడువు జులై 21తో ముగియగా.. మరోవారం రోజులపాటు గడువును పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయినవారు జులై 28 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్ కంప్యూటర్ బేస్‌డ్ ఆన్‌లైన్ టెస్ట్ (సీబీటీ) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ. 175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్‌లో 55 గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 55 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial