By: ABP Desam | Updated at : 06 Sep 2023 11:19 PM (IST)
Edited By: omeprakash
ఆర్ఆర్బీ క్లర్క్స్ ఫలితాలు
దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్/ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ సెప్టెంబరు 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఆగస్టు 12, 13, 19 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు పొందవచ్చు. సెప్టెంబరు 19 వరకు స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
మెయిన్ పరీక్ష: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో ఐదు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో రీజనింగ్- 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్/హిందీ లాంగ్వేజ్-40 ప్రశ్నలు-40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ-40 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ALSO READ:
2,000 ఖాళీలతో ఎస్‌బీఐ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షలు ఎప్పుడంటే?
భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 7 నుంచి 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలిలా
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నాబార్డులో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.89,150 వరకు జీతం
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు)' దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు
SSC JE Admit Card: ఎస్ఎస్సీ జూనియర్ ఇంజినీర్ 'టైర్-1' హాల్‌టికెట్లు విడుదల, రీజియన్ల వారీగా అందుబాటులో
IWST: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు
Teachers Transfers: టీచర్ల బదిలీ షెడ్యూలు విడుదల, పదోన్నతులు లేనట్లే!
AIASL: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 323 ఉద్యోగాలు, వాక్ఇన్ తేదీలివే
విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్ మూసివేత
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?
Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
/body>