అన్వేషించండి

UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలిలా

న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసింది. సెప్టెంబరు 6 నుంచి 26 వరకు దరఖాస్తులు..

న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

* ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024

పోస్టుల సంఖ్య: 167 (సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్).

సంస్థలు: ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్, నావెల్ అర్మామెంట్ సర్వీసెస్, జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).

విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ డిగ్రీ/ రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్‌లో పోస్టులకు ఫిజిక్స్ లేదా రేడియో ఫిజిక్స్/ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

వ‌యోప‌రిమితి:
01.01.2024 నాటికి నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం:
యూపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

➦ రాత‌ప‌రీక్ష,  ఇంటర్వ్యూ/పర్సనల్ టెస్ట్, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

➦ ప‌రీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమిన‌రీ (స్టేజ్‌-1), మెయిన్స్ (స్టేజ్-2).

➦ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన‌వారిని మెయిన్‌ ప‌రీక్షకు ఎంపిక చేస్తారు.

➦ మెయిన్స్ వచ్చిన మార్కులను ఆధారంగా స్టేజ్-3 పర్సనాలిటి టెస్ట్(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. 

పరీక్ష ఇలా...
ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 500 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 200 మార్కులకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షకు 2 గంటలు, పేపర్-1 పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

మెయిన్ పరీక్ష: మొత్తం 600 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 300 మార్కులకు పేపర్-1 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు.  ఒక్కో పేపర్‌కు 3 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. కన్వెన్షల్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నంలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 06.09.2023.

➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రితేదీ: 26.09.2023.

➦ దరఖాస్తుల సవరణ తేదీలు: 27.09.2023 - 03.10.2023.

➦ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ: 18.02.2024.

Notification

Online Application

ALSO READ:

పీజీసీఐఎల్‌లో 425 డిప్లొమా ట్రైనీ పోస్టులు- ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం ద్వారా డిప్లొమా ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 425 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.27,500 స్టైపెండ్‌ అందుతుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ఏటా డిసెంబర్ 9న అవతరణ దినోత్సవం, సీఎం కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ఏటా డిసెంబర్ 9న అవతరణ దినోత్సవం, సీఎం కీలక ప్రకటన
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ఏటా డిసెంబర్ 9న అవతరణ దినోత్సవం, సీఎం కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ఏటా డిసెంబర్ 9న అవతరణ దినోత్సవం, సీఎం కీలక ప్రకటన
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Embed widget