PGCIL: పీజీసీఐఎల్‌లో 425 డిప్లొమా ట్రైనీ పోస్టులు- ఈ అర్హతలుండాలి
పీజీసీఐఎల్ దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్ కార్యాలయాల్లో రీజినల్ రిక్రూట్‌మెంట్ స్కీం ద్వారా డిప్లొమా ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
POWERGRID Recruitment: న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్ కార్యాలయాల్లో రీజినల్ రిక్రూట్‌మెంట్ స్కీం ద్వారా డిప్లొమా ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 425 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.27,500 స్టైపెండ్ అందుతుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 425
రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 214, ఓబీసీ- 82, ఎస్సీ- 67, ఎస్టీ- 24, ఈడబ్ల్యూఎస్- 38, పీహెచ్- 32, ఎక్స్ సర్వీస్‌మెన్- 38, డీఎక్స్ ఎస్‌ఎం- 12
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.
అర్హత: కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.27,500 స్టైపెండ్ అందుతుంది.
వేతనం: శిక్షణ అనంతరం జూనియర్ ఇంజినీర్ గ్రేడ్-4 హోదాలో నియమితులవుతారు. నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వేతనం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.09.2023.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 23.09.2023.
ALSO READ:
వైఎస్సార్ జిల్లాలో 85 అంగన్‌వాడీ పోస్టులు
వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రాజమండ్రి- ఏపీ సివిల్ సప్లయ్ విభాగంలో 717 ఖాళీలు, వివరాలు ఇలా!
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 717 టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 8 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..