LinkedIn Profile: లింక్డ్ ఇన్‌లో ప్రొఫైల్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? ఇలా ఈజీగా చేసేయండి
LinedIn News | కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి లింక్డ్ ఇన్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం చాలా ఉపయోగంగా ఉంటోంది. లింక్డ్ ఇన్ తక్కువ కాలంలోనే అందర్నీ ఆకట్టుకుంటోంది.
LinedIn Account లింక్డ్ ఇన్ అకౌంట్ ఇప్పుడు అందరూ వాడుతున్న సోషల్ మీడియా నెట్ వర్కింగ్ ప్లాట్‌ఫామ్. ఈ అకౌంట్ కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఫ్రీ లాన్సర్లకు, బిజినెస్ పర్సన్లకు ఉపయోగపడుతుంది. బిజినెస్ ను విస్తరించడానికి కూడా లింక్డ్ ఇన్ చాలా బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం మారాలనుకునేవారు, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు.. తమకు తెలిసిన టెక్నాలజీలకు సంబంధించిన వివరాలను పబ్లిక్ ప్రొఫైల్‌లో ప్రదర్శించడం ద్వారా, హెడ్డింగులతో ఎంప్లాయిర్‌లను ఆకర్షించవచ్చు. ఆఖరికి ప్రొఫైల్ ఫొటో, లింక్డ్ ఇన్ బ్యానర్ ఇమేజ్ విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా సులభంగానే మీరనకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. ఫేస్ బుక్, ఇన్‌స్టాల మాదిరిగానే లింక్డ్ ఇన్ అకౌంట్ ను కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు. మన రిలేటెడ్ పీల్డ్ కు సంబంధించి జాబ్ ప్రొఫెషనల్స్‌తో పరిచయాలు పెంచుకుంటే జాబ్ సంపాదించడం మరింత సులభం అవుతుంది.
లింక్డ్ ఇన్ (LinkedIn)లో రెజ్యూమేను ఎలా అప్‌లోడ్ చేయాలి..?
- లింక్డ్ ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి లాగిన్ అవ్వాలి.
- మొదట ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయాలి.
- కిందికి స్ర్కోల్ చేయాలి. యాడ్ న్యూ పొజిషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- మీ జాబ్ ను వివరిస్తూ టైటిల్ క్రియేట్ చేయాలి..
- ప్రెషరా , ఎక్స్‌పీరియన్స్ డా అనేది తెలియజేయాల్సి ఉంటుంది.
- ఒకవేళ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యుంటే దాని వివరాలు ఇవ్వాలి.
- ఉద్యోగానికి సంబంధించి జాజ్ డిస్క్రిప్షన్ రాయాలి.
- అప్లోడ్ మీడియా మీద క్లిక్ చేసి మీ కంప్యూటర్ గ్యాలరీ నుంచి రెజ్యూమెను సెలక్ట్ చేసి అప్లోడ్ చేయాలి.
- మీరు చేస్తున్న ఉద్యోగం లేదా వెతుకుతున్న ఉద్యోగానికి సంబంధించి లేదా బిజినెస్‌కు సంబంధించి క్లుప్తంగా డిస్ర్కిప్షన్ సెక్షన్‌లో రాయాల్సి ఉంటుంది.
- మీరు రాస్తున్న కీవర్డ్స్ ద్వారా స్నేహితులు, కంపెనీ హెచ్ఆర్‌లు.. ఎవరైనా సరే ఈజీగా యాక్సిస్ చేసుకోవడానికి వీలుంంటుంది.
మీ లింక్డ్ ఇన్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారా..?
- మొబైల్‌లో మీ లింక్డ్ ఇన్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి..
- ప్రొఫైల్ ఫొటో క్రింద పక్కపక్కనే వ్యూ ప్రొఫైల్, సెట్టింగ్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. కిందికి స్క్రోల్ చేయాలి.
- చివర్లో ఉన్న హెల్ప్ సెంటర్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత వచ్చే పాపులర్ యాక్షన్స్ ట్యాడ్ మీద క్లిక్ చేయాలి.
- అక్కడే మనకు క్లోజ్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ ఎంచుకంటే మీ లింక్డ్ ఇన్ అకౌంట్‌ను డిలీట్ చేయవచ్చు.
- అయితే అకౌంట్ ను డిలీట్ చేయాలంటే తప్పనిసరిగా మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- దానికన్నా ముందు అకౌంట్‌ను ఎందుకు డిలీట్ చేస్తున్నారో రీజన్ అడుగుతుంది.
- అక్కడే ఇచ్చిన ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుంటే సరిపోతుంది.