అన్వేషించండి

APTET: 'టెట్‌' అర్హతలపై గందరగోళం, న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఉద్యోగార్థులు

ఏపీ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సెకండరీ గ్రేడ్ టీచర్(SGT)పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్-1కు బీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది.

APTET Eligibilities: ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సెకండరీ గ్రేడ్ టీచర్(SGT)పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్-1కు బీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది. దీనిపై కొందరు ఎస్జీటీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరచుగా అర్హతలను మారుస్తుండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జీవో వెనక్కి..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జీటీ టెట్ పేపర్-1కు బీఈడీ చేసిన వారికి అర్హత లేదని జనవరి 26న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జీఓ ఎంఎస్-4ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే 'నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)' ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసినందున.. పేపర్-1కు బీఈడీ వారికి అర్హత లేదంటూ జీఓలో పేర్కొన్నారు. దీని ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే టెట్ పేపర్-2 పరీక్షకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా అర్హులేనని పేర్కొన్నారు. దీని కోసం జనవరి 26న మెమో ఇచ్చారు. ఎస్జీటీలో బీఈడీ వారికి అర్హత లేనందున డిగ్రీ అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. కానీ, టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి కొత్తగా మరో మెమో జారీ చేశారు. ఎస్జీటీ పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్-1కు బీఈడీ వారికి అవకాశం కల్పించారు. 

రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో నో ఛాన్స్..
బీఈడీ వారికి అవకాశం లేదని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన కేసుల్లో సుప్రీం కోర్టు చెప్పిందని, దీనిపై ఎన్‌సీటీఈ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వనందున పాత విధానమే పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు జనవరి 26న జీఓ ఎందుకు ఇచ్చినట్లు? అదే జీఓను 12 రోజుల్లో రద్దు చేస్తూ మెమో జారీ చేయడం ఏంటి? ఏదైనా సవరణ చేస్తే సవరణ జీఓ ఇవ్వకుండా ప్రభుత్వం మెమో ఎలా జారీ చేస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టెట్, డీఎస్సీ అర్హతల్లో అయోమయం సృష్టించి, ఈ పరీక్షలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఎస్జీటీ పేపర్‌కు బీఈడీ వారికి అర్హత కల్పించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే టెట్ దరఖాస్తుల సమయంలోనే న్యాయ వివాదాలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న జీఓలు, మెమోలు పరస్పరం విరుద్ధంగా ఉండడంపైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నోటిఫికేషన్‌లో టెట్ పేపర్-1 అర్హతలు ఇలా..

🔰 పేపర్-1 ఎ (1 - 5వ తరగతులకు)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో బ్యాచిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు  బీఈడీ లేదా ఎంఈడీ అర్హత ఉండాలి. 

➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget