అన్వేషించండి

AP TET Exam Pattern: ఏపీటెట్ - 2024 అభ్యర్థులకు అలర్ట్ - అర్హతలు, పరీక్షల పూర్తి స్వరూపం ఇలా

AP TET 2024 Details: ఏపీటెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. టెట్ పరీక్షకు సంబంధించిన అర్హతలు, పేపర్-1, పేపర్-2 పరీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.. 

AP TET 2024 Eligibilities and Exam Pattern: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7న ఏపీ టెట్ (APTET)-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న టెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే ఫిబ్రవరి 17లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.750 చెల్లించాాల్సి ఉంటుంది. పేపర్-1, పేపర్-2లకు వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీటెట్‌కు సంబంధించిన అర్హతలు, పరీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.. 

APTET 2024 Notification & Online Application..

టెట్ అర్హతలు..

ఏపీటెట్‌కు సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునేవారు పేపర్-1 (ఎ & బి), 6 నుంచి 8వ తరగతుల వరకు బోధించాలనుకునేవారు పేపర్-2(ఎ & బి) రాయాల్సి ఉంటుంది.

🔰 పేపర్-1 ఎ (1 - 5వ తరగతులకు)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో బ్యాచిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు  బీఈడీ లేదా ఎంఈడీ అర్హత ఉండాలి. 

➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

🔰 పేపర్-1 బి (1 - 5వ తరగతులు) స్పెషల్ స్కూల్స్ 

➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ పీజీ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిప్లొమా (మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ జూనియర్ డిప్లొమా (టీచింగ్-డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)

➥ ప్రైమరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)

➥ డిప్లొమా (ఒకేషనల్ రిహాబిలిటేషన్-మెంటల్ రిహాబిలిటేషన్)/ డిప్లొమా (ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్-మెంటల్ రిటార్డేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిప్లొమా (హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్‌తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో RCI గుర్తింపు పొందిన ఏడాది కోర్సు కలిగి ఉండాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి.

🔰  పేపర్-2 ఎ (6 - 8వ తరగతులు)

మ్యాథమెటిక్స్-ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్/ సోషల్ స్టడీస్/ లాంగ్వేజ్ టీచర్లు 

➥ 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీతోపాటు బీఈడీ ఉండాలి. (లేదా)

➥ 45 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి.  (లేదా)

➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ లేదా బీఏఈడీ/బీఎస్‌ఈఈడీ. (లేదా)

➥ 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలి. (లేదా)

➥ 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. (లేదా)

➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

🔰  లాంగ్వేజ్ టీచర్స్..
లాంగ్వేజ్ టీచర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ ఉండాలి. (లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఒరియంటెల్ లాంగ్వేజ్ (లేదా) గ్రాడ్యేయేషన్ (లిటరేచర్) (లేదా)  సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీతోపాటు లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికేట్/బీఈడీ(సంబంధిత లాంగ్వేజ్‌) కలిగి ఉండాలి. 

🔰 పేపర్-2 బి (6 - 8వ తరగతులు) స్పెషల్ స్కూల్స్

➥ డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిగ్రీతోపాటు బీఈడీ(జనరల్)తోపాటు ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిగ్రీతోపాటు బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిగ్రీతోపాటు బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల పీజీ డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్/ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్/మల్లిపుల్ డిజెబిలిటి-ఫిజికల్, న్యూరోలాజికల్/లోకోమోటర్ ఇంపేర్‌మెంట్ & సెరిబ్రల్ పాల్సీ) అర్హత ఉండాలి. 

➥ సెకండరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)/ సీనియర్ డిప్లొమా టీచింగ్(డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)

➥ బీఏబీఈడీ (విజువల్ ఇంపేర్‌మెంట్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

ఏపీటెట్ పరీక్ష విధానం (AP TET 2024 Exam Pattern):

* పేపర్-1(ఎ): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

* పేపర్-1(బి): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (స్పెషల్ ఎడ్యుకేషన్)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

* పేపర్-2(ఎ): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1(తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా/సంస్కృతం)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్ & సైన్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-1(తెలుగు/ఇంగ్లిష్/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా/సంస్కృతం)-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

* పేపర్-2(బి): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (స్పెషల్ ఎడ్యుకేషన్)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

ఏపీటెట్ సిలబస్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

APTET Information Bulletin

అర్హత మార్కులు: ఏపీటెట్‌కు సంబంధించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల్లో కనీస అర్హత మార్కులను ఓసీలకు 60 శాతంగా; బీసీలకు 50 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.

ఏపీ డీఎస్సీ-2024 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
𝙺𝚃𝚁 𝙽𝚎𝚠𝚜: మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై కేటీర్ ఒత్తిడి!
మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై కేటీర్ ఒత్తిడి!
Arjun Son Of Vyjayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్MI vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ | ABP DesamMitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
𝙺𝚃𝚁 𝙽𝚎𝚠𝚜: మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై కేటీర్ ఒత్తిడి!
మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై కేటీర్ ఒత్తిడి!
Arjun Son Of Vyjayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
IPL 2025 GT Replacement: గుజ‌రాత్ టీంలో కీల‌క మార్పు.. గాయ‌ప‌డిన ఫిలిప్స్ స్థానంలో లంక  ఆల్ రౌండ‌ర్.. రేపు ఢిల్లీతో మ్యాచ్
గుజ‌రాత్ టీంలో కీల‌క మార్పు.. గాయ‌ప‌డిన ఫిలిప్స్ స్థానంలో లంక ఆల్ రౌండ‌ర్.. రేపు ఢిల్లీతో మ్యాచ్
Hyderabad Crime News: పిల్లల బాధ చూడలేకపోతున్నా, పిచ్చిది అంటే తట్టుకోలేకపోతున్నా- గాజులరామారంలో తల్లి రాసిన లేఖ లభ్యం
పిల్లల బాధ చూడలేకపోతున్నా, పిచ్చిది అంటే తట్టుకోలేకపోతున్నా- గాజులరామారంలో తల్లి రాసిన లేఖ లభ్యం
Tirumala: తిరుమలలో పార్కింగ్ వద్ద అగ్నిప్రమాదం ..భయంతో పరుగులు తీసిన భక్తులు!
తిరుమలలో పార్కింగ్ వద్ద అగ్నిప్రమాదం ..భయంతో పరుగులు తీసిన భక్తులు!
Kesari Chapter 2 Twitter Review: 'కేసరి చాప్టర్ 2' ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామాపై నెటిజన్లు ఏమంటున్నారంటే?
'కేసరి చాప్టర్ 2' ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామాపై నెటిజన్లు ఏమంటున్నారంటే?
Embed widget