CM Jagan : వర్శిటీల్లో పోస్టుల భర్తీకి ఆగస్టు 23న నోటిఫికేషన్ - 3925 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల కానుంది.
CM Jagan : ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది జగన్ ప్రభుత్వం. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు భర్తీ చేస్తారు. ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి.
కరవుసీమలో సిరులు, కియా ప్లాంట్ వద్ద చంద్రబాబు సెల్ఫీ - వైసీపీకి ఛాలెంజ్
ఏపీపీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. యూనివర్సిటీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలంటే పూర్తిస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల
విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఆగష్టు 23 న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒకేసారి 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెప్టెంబరు 3, 4 వారాల్లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. అక్టోబరు 10 వ తేదీకల్లా పరీక్షా ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్ లైన్‌లో పరీక్షల ఫలితాలు విడుదల తర్వాత నెల రోజుల్లో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. మొత్తం ప్రక్రియను నవంబరు 15 నాటికి పూర్తి చేసి అదే రోజు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను యూనివర్సిటీల వారీగా ప్రకటించనున్నారు.
చంద్రబాబు అబద్ధాలు లై డిటెక్టర్‌కూ దొరకవు, మమ్మల్ని గోకుతున్నారు కాబట్టే మాట్లాడుతున్నా - అంబటి
చాలాకాలంగా ఖాళీగా పోస్టులు
విశ్వ విద్యాలయాల్లో చాలా కాలంగా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ప్రభావం యూనివర్శిటీలపై పడుతోంది. సరైన విద్యాబోధన జరగక ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇటీవల వీసీలతో సమావేశం అయినప్పుడు.. ఎక్కువ మంది పోస్టుల భర్తీ గురించి విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ వెంటనే.. వాటిని భర్త చేయాలని ఆదేశించారు. వాటి ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం కానుంది.