CDAC: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, చెన్నైలో 101 ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి
CDAC: Jobs: చెన్నైలోని సి-డాక్ సంస్థ కాంట్రాక్ట్ విధానంో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

CDAC Project Staff Posts: చెన్నైలోని సీడాక్ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 101 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 101.
పోస్టుల వారీగా ఖాళీలు..
⏩ ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్): 31
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు.
జాబ్ లొకేషన్: చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, భారతదేశంలో ఎక్కడైనా, కొచ్చి, గోవా, భోపాల్, కార్వార్.
స్కిల్ సెట్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC), IoT, ఎంబెడెడ్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ (వెబ్ టెక్నాలజీస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, కమ్యూనికేషన్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, డిజైన్, వెబ్ డిజైనింగ్, UI / UX డిజైనర్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్,ఫుల్ స్టాక్ డెవలపర్, వెబ్ డెవలపర్, టెక్నికల్ సపోర్ట్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, టెస్టింగ్/QA, డీప్ లెర్నింగ్, డిపెండబుల్ & సెక్యూర్ కంప్యూటింగ్ (సైబర్ సెక్యూరిటీ), ఎంబెడెడ్ సిస్టమ్స్ & IoT.
జీతం: CTC - రూ.3.6 LPA.
⏩ ప్రాజెక్ట్ ఇంజినీర్/ పీఎస్ & ఓ ఎగ్జిక్యూటివ్ (ఎక్స్‌పీరియన్స్‌డ్): 30
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు.
అనుభవం: 1 - 4 సంవత్సరాలు.
జాబ్ లొకేషన్: చెన్నై, ఢిల్లీ, భారతదేశంలో ఎక్కడైనా, గోవా, లక్షద్వీప్, భోపాల్, కార్వార్.
స్కిల్ సెట్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ & ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికాం, కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, PCB డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెక్యూరిటీ, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, సెక్యూరిటీ అనలిస్ట్ క్లౌడ్ & నెట్‌వర్క్ సెక్యూరిటీ, SOC అనలిస్ట్, సిస్టమ్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, VLSI డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, సిస్టమ్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, IoT, ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఐటీ ఆపరేషన్స్, సర్వర్ సిస్టమ్స్ ఆపరేషన్స్, వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, మల్టీమీడియా, UI/UX డిజైనర్, మెకానికల్ / మెకాట్రానిక్స్, ఎడ్యుకేషన్ & ట్రైనింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, అప్లికేషన్ సపోర్ట్, డీఈవీవోపీఎస్ CI/CD.
జీతం: CTC - రూ.4.49 LPA.
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్: 30
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ అప్లికేషన్) లేదా సంబంధిత డొమైన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు.
అనుభవం: ఐటీఐ - 3 సంవత్సరాలు; డిప్లొమా(ఇంజినీరింగ్)- 1 సంవత్సరం; బీఎస్సీ- 1 సంవత్సరం.
జాబ్ లొకేషన్: చెన్నై.
స్కిల్ సెట్స్: నెట్‌వర్కింగ్, లైనక్స్ OS, సిస్టమ్ నిర్వహణ, హార్డ్‌వేర్ అసెంబ్లీ మరియు సాఫ్ట్‌వేర్ సెటప్, అండర్‌స్టాండింగ్ అఫ్ కంప్యూటర్ కంపోనెంట్స్.
జీతం: CTC - రూ.3.2 LPA.
⏩ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యుల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్: 10
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు.
అనుభవం: కనీసం 4 సంవత్సరాలు.
జాబ్ లొకేషన్: చెన్నై.
స్కిల్ సెట్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ & ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికాం, కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, PCB డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెక్యూరిటీ, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, సెక్యూరిటీ అనలిస్ట్ క్లౌడ్ & నెట్‌వర్క్ సెక్యూరిటీ, SOC అనలిస్ట్, సిస్టమ్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, VLSI డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, సిస్టమ్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, IoT, ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఐటీ ఆపరేషన్స్, సర్వర్ సిస్టమ్స్ ఆపరేషన్స్, వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, మల్టీమీడియా, UI/UX డిజైనర్, మెకానికల్ / మెకాట్రానిక్స్, ఎడ్యుకేషన్ & ట్రైనింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, అప్లికేషన్ సపోర్ట్, డీఈవీవోపీఎస్ CI/CD.
జీతం: CTC - రూ.8.49 LPA నుంచి రూ.14 LPA వరకు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.02.2025.
Project Associate (Fresher) Apply
Project Engineer/PS&O Executive (Experienced) Apply
Senior Project Engineer / Module Lead / Project Leader Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు