BIS Admitcard: బీఐఎస్ పరీక్ష అడ్మిట్ కార్డులు రిలీజ్, పరీక్ష తేదీ ఇదే!
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో మొత్తం 276 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 16న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా సెప్టెంబరు 3న ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించనున్నారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు సమర్పించి హాల్‌టికెట్లు పొందవచ్చు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో మొత్తం 276 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 16న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 19 నుంచి మే 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టు 12 నుంచి రాతపరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా సెప్టెంబరు 3న ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడ్ డిజైన్- క్యాడ్), సీనియర్ టెక్నీషియన్ (కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్) పోస్టుల భర్తీకి మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. మిగతా పోస్టుల రాతపరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. పరీక్ష తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
Also Read: BECIL Jobs: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.75 వేల జీతం!
అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1: అభ్యర్థులు అడ్మిట్ కార్డుకోసం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి - https://www.bis.gov.in/
Step 2: అక్కడ హోంపేజీలో ''What's New'' సెక్షన్‌లో కనిపించే “Exam Notice For The Advertisement NO. 2/2022/ESTT” పై క్లిక్ చేయాలి.
Step 3: ఇప్పుడు “Click here to download the Admit Card for Assistant (Computer Aided Design) & Senior Technician” పై క్లిక్ చేయాలి.
Step 4: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి Login బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 5: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. పరీక్షరోజు అడ్మిట్‌కార్డు లేనిదే అనుమతించరు. అడ్మిట్‌కార్డుతోపాటు అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Also Read: SSC JE 2022: జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, అర్హతలు ఇవే!
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు: 276
1) డైరెక్టర్-01
2) అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ)-01
3) అసిస్టెంట్ డైరెక్టర్(అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్)-01
4) అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & కన్జ్యూమర్ అఫైర్స్)-01
5) పర్సనల్ అసిస్టెంట్-28
6) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-47
7) అసిస్టెంట్ (క్యాడ్)-02
8) స్టెనోగ్రాఫర్-22
9) సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-100
10) హార్టికల్చర్ సూపర్‌వైజర్ (ల్యాబొరేటరీ)-47
11) సీనియర్ టెక్నీషియన్-25
పరీక్ష విధానం ఇలా..
మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజినింగ్ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులు, డొమైన్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమం 2 గంటలు.
అర్హత మార్కులు..
ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించాలంటే అభ్యర్థులు కనీసం ఒక్కో విభాగంలో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒవరాల్‌గా కూడా 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో స్కిల్ టెస్ట్/ ప్రాక్టికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..