BARC Recruitment: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, సబ్-ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, సబ్-ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు సెప్టెంబరు 12 చివరితేదీగా నిర్ణయించారు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 36
1) నర్సు/A: 13 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు డిప్లొమా (మిడ్ వైఫరీ) ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. (లేదా) బీఎస్సీ నర్సింగ్ (లేదా) హాస్పిటల్/ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్-3)లో మూడేళ్ల అనుభవంతో నర్సింగ్ 'ఎ' సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 12.09.2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
2) సైంటిఫిక్ అసిస్టెంట్/B (పాథాలజీ): 02 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో బీఎస్సీ డిగ్రీతోపాటు 60 శాతం మార్కులతో పీజీ డిప్లొమా (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉండాలి. (లేదా) 60 శాతం మార్కులతో బీఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉండాలి.
వయోపరిమితి: 12.09.2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
3) సైంటిఫిక్ అసిస్టెంట్/B (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్): 08 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో బీఎస్సీ డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో పీజీ డిప్లొమా (DMRIT/DNMT/DFIT) ఉండాలి. (లేదా) 60 శాతం మార్కులతో బీఎస్సీ (న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజీ) ఉండాలి.
వయోపరిమితి: 12.09.2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
4) సైంటిఫిక్ అసిస్టెంట్/C (మెడికల్ సోషల్ వర్కర్): 01 పోస్టు
అర్హత: 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (మెడికల్ సోషల్ వర్క్). రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.09.2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
5) సబ్-ఆఫీసర్/B: 04 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ (కెమస్ట్రీ ఒక అంశంగా) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో సబ్ ఆఫీసర్స్ కోర్సు ఉత్తీర్ఱులై ఉండాలి.
వయోపరిమితి: 12.09.2022 నాటికి 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
6) సైంటిఫిక్ అసిస్టెంట్/B (సివిల్): 08 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్).
వయోపరిమితి: 12.09.2022 నాటికి 18- 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 150, ఎస్సీ,ఎస్టీ, పీడభ్ల్యూడి,మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 35,400 నుంచి రూ. 44,900 అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.09.2022.
మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...