అన్వేషించండి

APPSC AEE Notification: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 21 ఏఈఈ పోస్టులు, ఎంపికైతే రూ.1.47 లక్షల వరకు జీతం

APPSC Recruitment: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

AP Pollution Control Board Jobs: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (APPCB)లో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (Assistant Environmental Engineer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

వివరాలు..

* అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 21.

పోస్టుల కేటాయింపు: ఓసీ-10, ఈడబ్ల్యూఎస్-02, బీసీ-06, ఎస్సీ-03.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్/మెకానికల్/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏఎంఐటీ సివిల్ ఎగ్జామినేషన్ (AMIE-India Civil examination) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2 సివిల్/మెకానికల్/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3 ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీ (కామన్ పేపర్)-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి.

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

జీత భత్యాలు: నెలకు రూ.57,100 - రూ.1,47,760 ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.02.2024.

➥ రాతపరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.

Notification

Website

ALSO READ:

ఏపీలో 38 డీఈవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ, జీతమెంతో తెలుసా?
ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DEO) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

➥ ఏపీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా

➥ ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Embed widget