అన్వేషించండి

APPSC DEO Recruitment: ఏపీలో 38 డీఈవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ, జీతమెంతో తెలుసా?

AP Jobs: ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

APPSC DEO Recruitment: ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DEO) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

వివరాలు..

* డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డీఈవో) పోస్టులు

ఖాళీల సంఖ్య: 38.

జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 07 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 08 పోస్టులు, జోన్-14: 11 పోస్టులు.

అర్హత: పీజీ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం: రూ.61,960 – రూ.1,51,370. 

పరీక్ష విధానం..

➥ స్క్రీనింగ్ పరీక్ష: మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.

➥ మెయిన్ పరీక్ష: మొత్తం 450 మార్కులు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2: ఎడ్యుకేషన్-1కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3: ఎడ్యుకేషన్-2కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.

➥ కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.01.2024. (11:59 PM)

➥ స్క్రీనింగ్ పరీక్ష తేది: 13.04.2024.

Notification

Website

                                 

ALSO READ:

➥ ఏపీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా

ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Drone Pilot Training: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్‌ శిక్షణ- కేవలం రూ.2 లక్షలకే డ్రోన్‌లు అందజేత
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్‌ కంపెనీ జోస్యం!
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
'OG' Priyanka Mohan: పూలటాప్ లో ప్రియాంక మోహన్ ..పవన్ కళ్యాణ్ 'OG' బ్యూటీ బర్త్ డే పిక్స్!
పూలటాప్ లో ప్రియాంక మోహన్ ..పవన్ కళ్యాణ్ 'OG' బ్యూటీ బర్త్ డే పిక్స్!
Embed widget