By: ABP Desam | Updated at : 08 Jan 2023 08:59 PM (IST)
Edited By: omeprakash
గ్రూప్-1 మాస్ కాపీంగ్
ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (జనవరి 8న) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. పరీక్షలో అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. విజయవాడ బెంజి సర్కిల్‌లోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో కాపీయింగ్ వెలుగు చూసింది. ఉదయం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు పోరంకి సచివాలయంలో పనిచేస్తున్న వెంకటేశ్ అనే అభ్యర్థి పరీక్షకు ఏకంగా మొబైల్ ఫోన్ తీసుకొచ్చాడు. తాపీగా మొబైల్‌లో గూగుల్ ఓపెన్ చేసి జవాబులు చూసి రాస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈసారి పేపర్-1 పరీక్ష తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదవి అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయం మిగిలిందని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రం.. ఉద్యోగార్థుల సత్తా పరీక్షించేందుకే ఎక్కువ నిడివిగల ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,499 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను మూడు వారాల్లోనే వెల్లడించనున్నారు. ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఆగస్టు నాటికి నియామకాలు పూర్తిచేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read:
APPSC: గుడ్ న్యూస్, త్వరలో 'గ్రూప్-2' నోటిఫికేషన్! పోస్టులెన్నో తెలుసా?
ఏపీలోని ఉద్యోగార్థులు ఒకవైపు 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ.. 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-2' పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు - ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇక మీదట ప్రిలిమ్స్ తరహాలోనే మెయిన్స్ పరీక్షను కూడా నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పటి నుంచి మెయిన్స్ పరీక్షలోనూ మూడు పేపర్ల స్ధానంలో రెండు పేపర్లే ఉండనున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆర్ధికశాఖ జనవరి 6న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్