అన్వేషించండి

AP DSC 2024: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్

Andhra Pradesh DSC 2024: లక్షల మంది ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నోటిఫికేషన్ ఆలస్యం, పోస్టులపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 

Andhra Pradesh DSC 2024: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీ అంశం చర్చకు వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వేసిన ఓ ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబుతూ డీఎస్సీ 2024 ఆలస్యానికి కారణాలు చెప్పారు. 

విష్ణుకుమార్ రాజు ఏం అడిగారు?

విష్ణుకుమార్ రాజు వేసిన ప్రశ్నకు మంత్రిలోకేష్ సమాధానం చెబుతూ డీఎస్సీపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. 1998 డీఎస్సీలో అన్యాయమైపోయిన వారికి ఇంత వరకు ఉద్యోగాలు రాలేదని వారికి న్యాయం చేయాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ వారి సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. అయితే 2018 ఆఖరిలో ఓ కమిటీ వేసి న్యాయం చేయాలని చూశారు కానీ ప్రభుత్వం మారడంతో న్యాయం జరగలేదన్నారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం అందులో కొందరికి వారిలో కొందరికి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మిగతా వారికి కూడా సహాయం చేయాలని అభ్యర్థించారు. 

లోకేష్‌ ఏం సమాధానం చెప్పారు?

దీనిపై సమాధానం చెప్పిన మంత్రి లోకేష్.... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11 డీఎస్సీలు తీసిందన్నారు. లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులను నియమించారన్నారు. అందుకే ఈసారి కూడా తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్‌పైనే పెట్టారని గుర్తు చేశారు. తన నెంబర్ రాష్ట్రంలోని చాలా మంది ప్రజలకు తెలుసునని... అందకే  డీఎస్సీపై తనకే నేరుగా మెసేజ్‌లు పెడుతున్నారని అన్నారు. 

నేరుగా మెసేజ్‌లు చేస్తున్నారు: లోకేష్‌

అభ్యర్థుల విజ్ఞప్తి మేరకే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందే టెట్ పెట్టామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అందులో 16వేలకుపైగా పోస్టులు భర్తీచేయబోతున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. 

Also Read: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తాం: లోకేష్‌

ఉద్యోగ కల్పన ఓ లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టే యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నామన్నారు లోకేష్. 1998 డీఎస్సీకి సంబంధించి గత ప్రభుత్వం 4534 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని అందులో 3939మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిందన్నారు. ఇంకా 600 ఖాళీలు ఇంకా ఉన్నాయన్నారు.  వాటి వివరాలు తీసుకొని వారి సమస్య ఎలా పరిష్కరించాలో చేస్తామన్నారు. మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించని అన్నారు. వారి రిటైర్మెంట్ ఏజ్‌ విషయంలో అధికారులతో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకోగలమని పేర్కొన్నారు. 

కోర్టులు చిక్కులు ఉండకూడదనే డీఎస్సీ 2024 వాయిదా: లోకేష్

డీఎస్సీపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయి, ఎందుకు కేసులు పడ్డాయి, ఇందులో ప్రభుత్వమే లిటిగెంట్ అవుతుందని అలాంటి పరిస్థితి రాకూడదనే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు లోకేష్. గతంలో పడిన కేసులు ఇతర అంశాలు స్టడీ చేసి పకడ్బంధీగా నోటిఫికేషన్ వేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈసారి వేసే నోటిఫికేషన్ మరోసారి న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఉన్నాం. అందుకే టైం పడుతుందన్నారు. కచ్చితంగా త్వరలోనే మంచి నోటిఫికేషన్ వస్తుందని మాట ఇచ్చారు. 

Also Read: ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget