APPSC: 'గ్రూపు-1' ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు, కారణమిదేనా!
ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని సభ్యులు తెచ్చిన ఒత్తిళ్ల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గత జూన్‌లో ఇంటర్వ్యూలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ పాత విధానంలోనే గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని సభ్యులు తెచ్చిన ఒత్తిళ్ల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్-1 ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు చేయడంవల్ల నియామక ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు వీలవుతుందని, అభ్యర్థులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. అయితే కొందరు అభ్యర్థులు పలుకుబడితో ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు పొందుతున్నారన్న విమర్శలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూలు తొలగిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడంతో నిరుద్యోగులు సంతోషపడ్డారు. అయితే ఇంతలోనే ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
సర్వీస్ కమిషన్‌లోని మెజార్టీ సభ్యులు ఇంటర్వ్యూలు ఉండాల్సిందే అంటే పట్టుబట్టడంతో గ్రూపు-1 ఉద్యోగాల విషయమై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు కమిషన్ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. సర్వీస్ కమిషన్‌లో సభ్యులైన విజయకుమార్, పద్మరాజు, సాలాంబాబు, రమణారెడ్డి, సుధీర్‌లే ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిందే అంటూ కమిషన్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కమిషన్ ప్రభుత్వానికి పంపింది. దీనిని అనుసరించి గ్రూపు-1లో తిరిగి ఇంటర్వ్యూలకు అనుమతినిస్తూ ప్రభుత్వం సెప్టెంబరు 28న ఉత్తర్వులు జారీచేసింది. ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూల రద్దు నిర్ణయం తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయినా రాకుండానే.. ఒక్క ఇంటర్వ్యూ అయినా జరపకుండానే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం విశేషం. గ్రూప్-1తోపాటు లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు కూడా ఇకపై ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
వయోపరిమితి పెంపు:
మరోవైపు ప్రస్తుతం యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుకు వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. గతంలో జరిగిన పెంపు ఉత్తర్వుల అమలు గడువు ఈ సెప్టెంబరు 30తో ముగిసింది.
Related Articles
APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!
ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..