GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల మూడో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల మూడో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాలకు సంబంధించి మూడో జాబితాలో ఏపీ నుంచి 36 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు.
ఎంపికైనవారికి ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం అందుతుంది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 28 లోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని ఇండియా పోస్ట్ సూచించింది. ఒరిజినల్ సర్టిఫికేట్లలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్‌లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు వుండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మూడో జాబితాను పోస్టుల శాఖ తాజాగా విడుదల చేసింది.
ఏపీ జీడీఎస్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జీడీఎస్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
మజగావ్‌డాక్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 531 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 531 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నేషనల్అప్రెంటిన్‌షిప్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కర్ణాటక బ్యాంక్‌లో పీవో పోస్టులు, ఎంపికైతే లక్ష రూపాయల జీతం
కర్ణాటక బ్యాంక్ దేశంలోని పలుశాఖలలో పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి పోస్టుల సంఖ్య ప్రకటించకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 26 చివరితేదీగా నిర్ణయించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..