Bank Jobs: కర్ణాటక బ్యాంక్‌లో పీవో పోస్టులు, ఎంపికైతే లక్ష రూపాయల జీతం
కర్ణాటక బ్యాంక్ దేశంలోని పలుశాఖల్లో పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవసరాన్ని బట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయనుంది.
కర్ణాటక బ్యాంక్ దేశంలోని పలుశాఖలలో పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి పోస్టుల సంఖ్య ప్రకటించకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 26 చివరితేదీగా నిర్ణయించారు.
వివరాలు...
* ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) (స్కేల్-1) పోస్టులు
1) ఆఫీసర్ (జనరల్ బ్యాంకింగ్)
2) అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (AFO)
3) లా ఆఫీసర్
4) మార్కెటింగ్ ఆఫీసర్
అర్హతలు: ఏదైనా విభాగంలో పీజీ డిగ్రీ/ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్)/ డిగ్రీ (లా)/ ఎంబీఏ (మార్కెటింగ్/ఫైనాన్స్) ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 01.08.2023 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారిక ఏడాది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
పరీక్ష విధానం..
* మొత్తం 225 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 202 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో కంప్యూటర్ అవేర్‌నెస్ 30 ప్రశ్నలు-30 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. దీంతోపాటు 25 మార్కులకు ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. 2 ప్రశ్నలు ఉంటాయి.
* ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు రుణాత్మక మార్కు ఉంటుంది.
జీతం: అన్ని భత్యాలు కలిపి రూ.లక్ష వరకు ఉంటుంది.
దరఖాస్తు చివరితేది: 26.08.2023.
ALSO READ:
ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆగస్టు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు. సెప్టెంబరు 2 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా 4,545 ఖాళీలను భర్తీచేయనుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
ఏఎఫ్ క్యాట్ 2023 అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ - 02/2023) రాత పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు ఆగస్టు 10న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 25 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జులైలో కోర్సు ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..