AFCAT 2023: ఏఎఫ్ క్యాట్ 2023 అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ - 02/2023) రాత పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు ఆగస్టు 10న విడుదలయ్యాయి
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ - 02/2023) రాత పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు ఆగస్టు 10న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 25 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జులైలో కోర్సు ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు.
AFCAT - 2023 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 276 ఉన్నత హోదా ఉద్యోగాల భర్తీకి ఏఎఫ్‌క్యాట్ 02/2023 నోటిఫికేషన్ జూన్ 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైమానిక దళంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జూన్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
రాతపరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ & మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి.
పోస్టుల వివరాలు..
* ఏఎఫ్‌క్యాట్ - AFCAT - 02/2023
ఖాళీల సంఖ్య: 276
1) ఫ్లయింగ్ బ్రాంచ్: 11 (మెన్-05, ఉమెన్-06)
2) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 151 (మెన్-136, ఉమెన్-15)
విభాగం: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.
3) గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 114 (మెన్-99, ఉమెన్-15)
విభాగం: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ.
4) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ
విభాగం: ఫ్లయింగ్ బ్రాంచ్.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌లో 875 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్ లిమిటెడ్ డబ్ల్యూసీఎల్‌కి చెందిన వివిధ ప్రాంతాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 875 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సర్వేయర్, మెకానిక్ డీజిల్, వైర్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), పంప్ ఆపరేటర్ అండ్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ ట్రేడ్‌లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..