News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IBPS Clerk: ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆగస్టు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.

FOLLOW US: 
Share:

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆగస్టు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు. సెప్టెంబరు 2 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్‌ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్‌) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా 4,545 ఖాళీలను భర్తీచేయనుంది. ప్రిలిమిన‌రీ పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్‌ 2 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

క్లర్క్ అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -  ibps.in

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Online Preliminary Exam Call Letter for CRP-Clerks-XIII' లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి. 

Step 4: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.

Step 4: అడ్మిట్ కార్డు డౌన్‌‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షరోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లడం మంచిది. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పోస్టుల వివరాలు..

* ఐబీపీఎస్‌ క్లర్క్‌-సీఆర్‌పీ-XIII 

ఖాళీల సంఖ్య: 4545

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి: 20-28 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రిలిమినరీ పరీక్షను మూడు రోజులపాటు నిర్వహించనుండగా.. మెయిన్ పరీక్ష మాత్రం ఒకే రోజులో ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే  ఈ పరీక్షలో మూడు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున.. గంట వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. అభ్యర్థి ప్రతి విభాగంలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్ స్కోర్ దాటిన అభ్యర్థులను మాత్రమే ఖాళీలకు అనుగుణంగా షార్ట్‌లిస్ట్ చేసి మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు.

మెయిన్ పరీక్ష: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి 190 ప్రశ్నలు అడుగుతారు. వీరిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, 35 నిమిషాల వ్యవధి; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు 35 నిమిషాల వ్యవధి; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు 45 నిమిషాల వ్యవధి; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు 45 నిమిషాల వ్యవధిలో.. అంటే మొత్తంగా మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు-200 మార్కులకు 160 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్.
 
ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.07.2023.

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2023.

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు (ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): 26.08.2023, 27.08.2023, 02.09.2023.

➥ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి: సెప్టెంబరు/అక్టోబరు 2023.

➥ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబరు/ అక్టోబరు, 2023.

➥ మెయిన్ పరీక్ష తేదీ(ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): 07.10.2023.

➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.

Notification

Website

Published at : 16 Aug 2023 08:20 PM (IST) Tags: Bank Jobs IBPS Clerks Admitcard IBPS Clerks Prelims Exam Hall Ticket IBPS Clerks Preliminary Exam Call Letter IBPS Clerks Exam Admit Card

ఇవి కూడా చూడండి

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

ICMR: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు

ICMR: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు

టాప్ స్టోరీస్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే