By: ABP Desam | Updated at : 11 Sep 2023 10:38 AM (IST)
Edited By: omeprakash
పోస్టల్ జీడీఎస్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో జీడీఎస్ (స్పెషల్ డ్రైవ్) పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల నాలుగో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాలకు సంబంధించి మూడో జాబితాలో ఏపీ నుంచి 28 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 32 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు.
ఎంపికైనవారికి ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం అందుతుంది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబరు 19 లోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని ఇండియా పోస్ట్ సూచించింది. ఒరిజినల్ సర్టిఫికేట్లలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్‌లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు వుండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మూడో జాబితాను పోస్టుల శాఖ తాజాగా విడుదల చేసింది.
ఏపీ జీడీఎస్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జీడీఎస్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 24లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామక ప్రక్రియ చేపట్టింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్‌మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం
JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?
IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులు, సంక్షిప్త ప్రకటన విడుదల
NBE Jobs: నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్‌లో 48 ఖాళీలు
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
/body>