CAS Recruitment: ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 24లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామక ప్రక్రియ చేపట్టింది.
వివరాలు..
* సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 250.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు-47 సంవత్సరాలు, దివ్యాంగులు-52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు-50 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్‌షిప్ ఆధారంగా. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్కులకు 75 మార్కులు కేటాయిస్తారు. కాంట్రాక్ట్ విధానంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా పనిచేస్తున్నవారికి 15 శాతం మార్కులు, 10 మార్కుల వరకు ఇంటర్న్‌షిప్‌కు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.09.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ప్రక్రియ ప్రారంభం: 13.09.2023.
ALSO READ:
ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్‌మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎస్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. వాక్-ఇన్ సమయానికి 28 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 5-10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..