News
News
X

Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

కరోనా నుంచి కాపాడుకునేందుకు టీకాలు తీసుకుని ఊపిరి పీల్చుకునేలోపు చైనా నుంచి కొత్త కొత్త వైరస్‌లు ప్రపంచంపై దాడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా జునోటిక్ లాంగ్యా అనే వైరస్ ప్రపంచంపై దాడి ప్రారంభించింది.

FOLLOW US: 

Zoonotic Langya virus:   ప్రపంచాన్ని మేడిన్ చైనా వైరస్‌లు వదలడం లేదు. ఇప్పటికీ కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆఫ్రికా నుంచి మంకీపాక్స్ అంతటా విస్తరిస్తోంది. తాజాగా..  చైనాలో ‘లాంగ్యా హెనిపా’ అనే కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకటించింది.  ఇప్పటికే ఈ వైరస్‌ను చైనాలోని షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో గుర్తించారు.  జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చైనా లో వెలుగు చూసిన   జునోటిక్ ‘లాంగ్యా హెనిపా’  వైరస్‌

 జునోటిక్ ‘ లాంగ్యా హెనిపా ’  వైరస్‌ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తైనా, తైవాన్ శాస్త్రవేత్తలుచెబుతున్నారు.  దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయని, అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెంపుడు జంతువులపై నిర్వహించిన సెరోలాజికల్‌ సర్వేలో మేకలు, కుక్కల రక్త నమూనాలను అధికారులు సేకరించి, పరీక్షించారు. దీంతో మేకల్లో 2 శాతం, కుక్కల్లో 5 శాతం వరకు వైరస్‌ పాజిటివ్ తేలింది. 27శాతం ఎలుకల్లో వైరస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

ఒకరి నుంచి మరొకరికి సోకుతుందనే ఆధారాలు లేవంటున్న చైనా, తైవాన్

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించగా వెలుగులోకి వచ్చింది.  అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారికి పరీక్షలు నిర్వహించగా 35 మందిలో లాంగ్యా హెనిపా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. అయితే, బాధితులు ఒకరికొకరికి సన్నహిత సంబంధాలు లేవని, వైరస్‌ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. 

వైరస్ సోకితే తీవ్ర లక్షణాలు

జునోటిక్ ‘లాంగ్యా హెనిపా’  వైరస్ సోకితే లక్షణాలు ఎలా ఉంటాయో వైద్యులు ప్రకటించారు. వైరస్‌ సోకిన 26మందిలో రోగులు జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోవడంతో పాటు లివర్‌, కిడ్నీలపై వైఫల్యం చెందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ వైరస్‌పై ప్రపంచదేశాలు అలర్ట్ అవుతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

 ఇంకా వెల్లువెత్తుతున్న కరోనా వేరియంట్లు 

దేశంలో కరోనా కేసులు నిలకడగా ఉంటున్నాయి. ప్రపంచం మొత్తం అదే పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్నాయి. తొలుత ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వేరియంట్ ఇప్పుడు కనిపించడం లేదు. కానీ దానికి అనుబంధంగా వచ్చిన వేరియంట్లు మాత్రం దడ పుట్టిస్తూనే ఉన్నాయి. చాలా వరకూ టీకాల ద్వారా వాటిని కట్టడి చేసినా కొత్త వేరియంట్లు భయం పుట్టిస్తూనే ఉన్నాయి.  కరోనాకు సంబంధం లేకుండా వస్తున్న మంకీపాక్స్ లాంటి  వైరస్‌లు కొత్తగా దడ పుట్టిస్తున్నాయి. ఈ వైరస్‌ల నుంచి ప్రపంచానికి మోక్షం కలిగే సూచనలు కనిపించడం లేదు. 

Published at : 09 Aug 2022 07:42 PM (IST) Tags: Health china Zoonotic Langya virus Zoonotic Langya virus cases

సంబంధిత కథనాలు

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

Covid-19: కోవిడ్-19, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

Covid-19: కోవిడ్-19, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

ఈ ఆహారాలు తరచూ తిన్నారో, త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త

ఈ ఆహారాలు తరచూ తిన్నారో, త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త

Carrot Peel Benefits: క్యారెట్ తొక్కతో ఎన్నో ప్రయోజనాలో తెలిస్తే ఇంకెప్పుడు వాటిని పారెయ్యరు

Carrot Peel Benefits: క్యారెట్ తొక్కతో ఎన్నో ప్రయోజనాలో  తెలిస్తే ఇంకెప్పుడు వాటిని పారెయ్యరు

Bleeding Nose : ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇలా చేసి ఆపేద్దాం

Bleeding Nose : ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇలా చేసి ఆపేద్దాం

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ