అన్వేషించండి

Difference Between Gas and Heart Attack: గ్యాస్ నొప్పికి హార్ట్ ఎటాక్ మధ్య తేడా ఏంటి? డౌట్స్‌ క్లియర్ చేయడానికి ఈ విషయాలు తెలుసుకోండి!

Difference Between Gas and Heart Attack: గ్యాస్‌ అనేది పొట్టుసంబంధించినది, ప్రమాదకరం కాదు. గుండెపోటు వైద్య అత్యవసర పరిస్థితి, ఆలస్యం ప్రాణాంతకం కావచ్చు. ఛాతీ నొప్పిని గ్యాస్ అని పొరపాటు పడవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Difference Between Gas and Heart Attack: మనం చాలా మంది ఏదో ఒక సమయంలో ఛాతీ నొప్పి లేదా మంట వంటి సమస్యను అనుభవించి ఉంటాం. ఒక్కోసారి గ్యాస్ వచ్చిందేమో అనిపిస్తుంది, మరికొన్నిసార్లు గుండెపోటు వస్తుందేమోనని భయమేస్తుంది. వాస్తవానికి, గ్యాస్, గుండెపోటు రెండూ ప్రారంభ లక్షణాల్లో చాలావరకు ఒకేలా ఉండవచ్చు, ముఖ్యంగా ఛాతీ నొప్పి లేదా భారంగా అనిపించినప్పుడు, అందుకే ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. సరైన సమయంలో అవసరమైన చికిత్సను పొందలేకపోతారు. 

గ్యాస్ సమస్య సాధారణంగా పొట్టకు సంబంధించినది. ప్రమాదకరం కాదు. గుండెపోటు ఒక తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి, దీనిలో ఆలస్యం ప్రాణాంతకం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, గ్యాస్ నొప్పి, గుండెపోటు నొప్పి ఎలా భిన్నంగా ఉంటాయో?  ఎప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, గ్యాస్, గుండెపోటు మధ్య తేడా ఏమిటి ? ఈ రెండింటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చో ఈ రోజు మీకు తెలియజేస్తాము. 

1. నొప్పి ఎక్కడ? ఎలా ఉంటుంది ?- గ్యాస్ నొప్పి సాధారణంగా పొత్తికడుపుపై భాగంలో లేదా ఛాతీ దిగువ భాగంలో ఉంటుంది. ఇది మంట, సూదులు గుచ్చినట్లు లేదా తిమ్మిరిలా అనిపిస్తుంది. ఈ నొప్పి శరీర స్థితిని మార్చడం ద్వారా తగ్గుతుంది లేదా దాని స్థానాన్ని కూడా మార్చుకోవచ్చు. గ్యాస్‌తోపాటు కడుపు ఉబ్బరం, తేన్పులు, మలవిసర్జన తర్వాత ఉపశమనం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

గుండెపోటు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ నొప్పి ఛాతీ మధ్యలో భారంగా, ఒత్తిడి లేదా భారంగా అనిపిస్తుంది, ఏదో గుండెను నొక్కినట్లుగా ఉంటుంది, ఈ నొప్పి సాధారణంగా ఎడమ చేయి, దవడ, మెడ లేదా వీపు వైపు వ్యాపిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీర స్థితిని మార్చడం లేదా తేన్పులు వచ్చినప్పుడు ఇందులో ఉపశమనం ఉండదు. 

2. నొప్పి సమయం, ఉపశమనం ఎలా లభిస్తుంది? : గ్యాస్ నొప్పి కొన్ని నిమిషాల నుంచి 1 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. గ్యాస్ తేన్పు లేదా మలవిసర్జనతో ఉపశమనం లభిస్తుంది. ఈ నొప్పి అప్పుడప్పుడు వస్తుంది. గుండెపోటు నొప్పి సాధారణంగా 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. శరీరానికి విశ్రాంతినిచ్చినా ఎటువంటి మార్పు ఉండదు. నొప్పి నిరంతరం ఉంటుంది. పెరుగుతుంది. ఇది ప్రమాదానికి సంకేతం కావచ్చు. 

3. రెండింటి లక్షణాల్లో తేడా: గ్యాస్ సమస్యలో కడుపు ఉబ్బరం, గడబిడ, తేన్పులు,   కొద్దిగా అసౌకర్యం కలుగుతుంది. సాధారణంగా చెమటలు పట్టవు, మైకం కూడా రాదు. గుండెపోటులో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, అవి చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకం, వికారం, బలహీనత, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి ఉంటాయి. మహిళలకు పొత్తికడుపు నొప్పి, అసాధారణ అలసట,  తలనొప్పి వంటి విభిన్న లక్షణాలు కూడా ఉండవచ్చు. 

దీని నుంచి ఎలా రక్షించుకోవాలి? 

గ్యాస్ లేదా గుండెపోటు, రెండింటి నుంచి రక్షించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్యాస్ నుంచి రక్షించడానికి ఒకేసారి ఎక్కువ తినవద్దు. బీన్స్, కోలా, మసాలా దినుసులకు దూరంగా ఉండండి. సమయానికి ఆహారం తీసుకోండి, ఒత్తిడిని తగ్గించుకోండి. నెమ్మదిగా తినండి. దీంతో పాటు, గుండెపోటు నుంచి రక్షించడానికి ప్రతిరోజూ కొద్దిగా వ్యాయామం చేయండి, పొగతాగడం మానుకోండి, బరువును నియంత్రించండి, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా పరీక్షించండి, ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి, ఎక్కువ నీరు తాగండి. మంచిగా నిద్ర పోవాలి.  

ఛాతీలో తీవ్రమైన ఒత్తిడి, చేయి లేదా దవడ వైపు నొప్పి వస్తుంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం లేదా మైకం అనిపిస్తే, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయండి. మీ సొంత కారు నడుపుకుని ఆసుపత్రికి వెళ్ళడానికి ప్రయత్నించవద్దు. సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. గ్యాస్‌తో వచ్చే నొప్పిలో సాధారణంగా అత్యవసర చికిత్స అవసరం లేదు, కానీ నొప్పి నిరంతరం ఉంటే, చాలా తీవ్రంగా ఉంటే, వాంతులు లేదా జ్వరం కూడా వస్తే, వైద్యుడిని సంప్రదించడం అవసరం. 

Frequently Asked Questions

గ్యాస్ నొప్పి మరియు గుండెపోటు నొప్పి మధ్య ప్రధాన తేడా ఏమిటి?

గ్యాస్ నొప్పి కడుపు పైభాగంలో, మంటలా ఉంటుంది, స్థానం మారుతుంది. గుండెపోటు నొప్పి ఛాతీ మధ్యలో, భారంగా ఉండి, ఎడమ చేయి, దవడకు వ్యాపిస్తుంది.

గుండెపోటు లక్షణాలు ఏమిటి?

గుండెపోటులో ఛాతీ మధ్యలో తీవ్రమైన ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం, మైకం, వికారం వంటి లక్షణాలు ఉంటాయి.

గ్యాస్ నొప్పి నుండి ఉపశమనం ఎలా లభిస్తుంది?

గ్యాస్ నొప్పి కొన్ని నిమిషాల నుండి గంట వరకు ఉంటుంది, తేన్పు లేదా మలవిసర్జనతో ఉపశమనం లభిస్తుంది.

గుండెపోటు నొప్పి ఎంతసేపు ఉంటుంది?

గుండెపోటు నొప్పి సాధారణంగా 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది, విశ్రాంతి తీసుకున్నా తగ్గదు, పెరుగుతుంది.

గుండెపోటు వస్తుందని అనుమానం వస్తే ఏమి చేయాలి?

ఛాతీలో ఒత్తిడి, నొప్పి, శ్వాస ఇబ్బంది, చెమటలు, మైకం ఉంటే వెంటనే అంబులెన్స్ కు కాల్ చేయాలి, సొంతంగా ఆసుపత్రికి వెళ్ళకూడదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Advertisement

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget