Mental Health : సుఖ, శాంతులు చచ్చి చెడి సాధించనవసరం లేదు బ్రో.. ఇవి ట్రై చేయి సెట్ అయిపోతావ్
World Mental Health Day 2025 : మానసికంగా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకే ప్రతి ఏడాది అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చరిత్ర, ప్రాముఖ్యతలు చూసేద్దాం.

Mental Health Awareness Tips : ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని చేసినా.. మానసిక ఆరోగ్యం అనేది అన్నింటికంటే, అందరికంటే ముఖ్యం. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే ఏ పని అయినా చేయగలం. ఎలాంటి లో ఫేజ్ అయినా క్రాస్ చేయగలుగుతాము. కానీ విషయమేమిటంటే చాలామంది దీనిని పట్టించుకోరు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యానికి ఓ ప్రత్యేక రోజు(World Mental Health Day)ను కేటాయించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఏ మనిషి అయినా స్ట్రాంగ్ అని చెప్పాలంటే కేవలం శారీరకంగానే, మానసికంగా కూడా వాళ్లు ఎంత స్ట్రాంగ్ అని తెలుసుకోవాలి. గట్టిగా చెప్పాలంటే బాడీ స్ట్రెంత్ కంటే మెంట్ హెల్త్ ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే శారీరకంగా ఎంత బలవంతుడైనా.. మానసికంగా కృంగిపోతే ఆ బలం ఎందుకు పనికి రాదు. కానీ శారీరకంగా ఎలాంటి బలహీనమున్నా మానసికంగా అతను స్ట్రాంగ్ అయితే అనుకున్న పనిని కచ్చితంగా నెరవేయగలుగుతాడు. ఈ విషయాన్ని గుర్తిస్తే చాలు. అందుకే మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు.
వరల్డ్ మెంటల్ హెల్త్ డే చరిత్ర
మానసిక ఆరోగ్యాన్ని గుర్తిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ వరల్డ్ మెంటల్ హెల్త్ డే నిర్వహిస్తున్నారు. దీనిని మొదటిసారిగా 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవాగహన కల్పించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించారు. ప్రతి ఏడాది అక్టోబర్ 10న దీనిని జరుపుతున్నారు. మొదట్లో దీనిని కేవలం అవగాహన కోసమే జరిపినా.. తర్వాత ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో దీనిని నిర్వహిస్తున్నారు.
మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యమంటే..
ఈ మధ్యకాలంలో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చదువు, ఉద్యోగం, పేరెంట్స్, పబ్లిక్ స్టాండర్డ్స్, రిలేషన్స్, డబ్బు.. ఇలా ఒకటా.. రెండా.. ఎన్నో విషయాలు మనసును కృంగిపోయేలా చేస్తున్నాయి. దీంతో చాలామందిలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగి మానసికంగా వారు కృంగిపోయేలా చేస్తున్నాయి. వీటితో ఇబ్బంది పడేవారు సమస్యకు చెక్ పెట్టకపోతే అది శారీరక ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మనసు ఆరోగ్యంగా ఉంచుకోవడం లైఫ్స్టైల్లో ఓ భాగం కావాలి.
మానసిక ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని విషయాలు కచ్చితంగా పాటించాలి. ఇప్పటికే మీరు మెంటల్లీ వీక్‌గా ఉన్నా.. లేదు నేను మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి అనుకున్నా.. కొన్నింటినీ మీ లైఫ్స్టైల్లో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటంటే..
ప్రతిరోజూ ధ్యానం, యోగా చేయాలి. అవి చేయడం కుదరకపోతే కనీసం ఓ పది నిమిషాలు డీప్ బ్రీతింగ్ చేస్తూ శ్వాసపై దృష్టి పెట్టాలి.
శరీరానికి ఇవి ఇస్తే.. మనసుకు మేలు జరుగుతుందట
శారీరకంగా చేసే వ్యాయామం కూడా మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తుంది. కాబట్టి జిమ్‌కి వెళ్లండి. అది కుదరట్లేదా అయితే వాకింగ్, జాగింగ్, డ్యాన్స్ వంటివి చేయవచ్చు. జర్నల్ రాయడం కూడా మంచిదే. ఇవి స్ట్రెస్ తగ్గించేందుకు అనువైనవి. ఫుడ్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మంచి పాత్రపోషిస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి.
బ్రేక్ ఉండాలి.. రెస్ట్ తీసుకోవాలి
నిద్ర లేకపోతే శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు పడుకోండి. రోజంతా ఫోన్, సోషల్ మీడియానే కాకుండా కాసేపు దానికి బ్రేక్ తీసుకోండి. నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత దానికి వీలైనంత దూరంగా ఉండండి. మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోగలిగే వ్యక్తి మాట్లాడుతూ, కాంటాక్ట్‌లో ఉండండి. వెకేషన్‌కి వెళ్లండి. కుదరదా నచ్చి ప్లేస్‌కి వెళ్లండి. అది కూడా జరగాదా? అయితే మీకు దగ్గర్లో ఉండే పార్క్‌కి వెళ్లి కాసేపు కూర్చొని రండి.
నచ్చిన పని చేయండి. మీ హాబీలు కూడా స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. అన్నింటికి మించి.. మీకు నిపుణుల సహాయం అవసరం అనిపిస్తే.. ఏమి ఆలోచించకుండా సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. ఎందుకంటే మీకు మీరు అవసరం. కాబట్టి ఇతరులు ఏమి ఆలోచిస్తారో అని కాకుండా.. మీకు ఏది మంచిదో అది చేయడానికి వెనకాడకండి.






















