Stress Relief with Smile : బాధలు అందరికీ ఉంటాయి.. కాసేపు నవ్వుకోండి, ఆరోగ్యానికి మంచిదట
Laughter and Health : హ్యపీగా నవ్వుతూ ఉంటే మానసిక ఆరోగ్యానికే కాదు.. శారీరక ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు నిపుణులు. కాబట్టి కాసేపు బ్రేక్ తీసుకని నవ్వేయండి. ఈ లాభాలు పొందేయండి.

Healing Power of Laughter : లైఫ్లో ఎన్ని బాధలున్నా.. నచ్చిన వాళ్లతో ఉంటూ.. నచ్చిన వీడియో చూసుకుంటూ.. రోజులో కాసేపు నవ్వుకుంటే చాలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నవ్వితే మంచిది కాదని.. తర్వాత చెడు జరుగుతుందని.. నవ్వు నాలుగు విధాల చేటు అంటూ కొందరు మనస్ఫూర్తిగా నవ్వలేరు. కానీ నవ్వు నలభై విధాల మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికే కాదు.. శారీరక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు. నవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
నవ్వుతూ, సంతోషంగా ఉండటం వల్ల కలిగే లాభాలివే
ఒత్తిడి దూరం : నవ్వడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. మన శరీరంలోని శారీరక ఒత్తిడిని తగ్గించడంలో నవ్వు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తపోటును తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది.
కండరాలకు మేలు : నవ్వడం వల్ల మానసిక స్థితి మెరుగుపడడమే కాకుండా రక్త ప్రసరణను పెంచి కండరాలను సడలిస్తుంది.
ఇమ్యూనిటీకై : నవ్వినప్పుడు మెదడులో మంచి భావన కలుగుతుంది. దానివల్ల న్యూరోపెప్టైడ్‌లు అనే చిన్న ప్రోటీన్‌లను విడుదల చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
హ్యాపీ హార్మోన్స్ : నవ్వేటప్పుడు మీ శరీరంలో మూడు వేర్వేరు హార్మోన్లను విడుదల అవుతాయి. డోపమైన్, ఎండార్ఫిన్లు, సెరోటోనిన్. ఈ మూడింటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఇవి మీరు సంతోషంగా ఉండేలా చేస్తాయి.
నొప్పులు దూరం : నవ్వడం వల్ల ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. వీటివల్ల శరీరంలో నొప్పి లేదా చిన్న చిన్న నొప్పులను తాత్కాలికంగా తగ్గుతాయి. అలాగే నవ్వడం వల్ల నొప్పిని భరించే సామర్థ్యం పెరుగుతుంది.
డిప్రెషన్ దూరం : నవ్వడం వల్ల సానుకూల భావోద్వేగాలు పెరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండటం వల్ల డిప్రెషన్ కూడా తగ్గుతుంది. అలాగే గుండె, రక్తనాళాల ఆరోగ్యం మెరుగవుతుంది.
ఇవే కాకుండా నవ్వడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కార్టిసాల్ తగ్గడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతుంది. దీనివల్ల రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. నవ్వుతూ సంతోషంగా ఉండేవారు తక్కువ అనారోగ్యానికి గురవుతారు. రోగనిరోధక శక్తి మెరుగవతుంది. దీనివల్ల ఆయుష్షు కూడా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రెండ్స్తో ఉంటూ కాసేపు నవ్వుకోండి. నచ్చిన వ్యక్తితో సమయాన్ని గడపండి. మీ మూడ్ని మెరుగుపరిచే మనుషులతో ఉంటే మరీ మంచిది. అలాగే నచ్చిన కమెడియన్ వీడియోలు, ఇతర కామెడీ షోలు చూడవచ్చు.






















