మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 10 టిప్స్

Published by: Geddam Vijaya Madhuri

ధ్యానం లేదా యోగా చేయండి. ప్రతి రోజు కనీసం 10–15 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టండి.

వ్యాయామం చేయండి. నడక, జాగింగ్ లేదా డ్యాన్స్ కూడా స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.

సమతుల్య ఆహారం తీసుకోండి. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారం మెదడును సజీవంగా ఉంచుతుంది.

తగినంత నిద్రపడండి. రోజుకు 7–8 గంటలు నిద్ర తప్పనిసరి.

డిజిటల్ బ్రేక్ తీసుకోండి. ఫోన్, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి.

మీ ఫీలింగ్స్ లోపలే ఉంచుకోకుండా.. నమ్మకమైన వారితో పంచుకోండి.

జర్నల్ రాయడం అలవాటు చేసుకోండి. భావోద్వేగాలను రాయడం ద్వారా మనసు తేలికవుతుంది.

ప్రకృతిలో సమయం గడపండి. గ్రీన్ స్పేస్‌లలో గడపడం మనసుకు ప్రశాంతత ఇస్తుంది.

మీకు ఇష్టమైన హాబీలు చేసుకోండి. సంగీతం, పెయింటింగ్, గార్డెనింగ్ లాంటి పనులు ఒత్తిడిని తగ్గిస్తాయి.

అవసరమైతే నిపుణుడి సహాయం పొందండి. సైకలాజిస్టును సంప్రదించడానికి ఆలోచించకండి.