అన్వేషించండి

ముగ్గుతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? మెమొరీ‌లాస్ పేషెంట్ స్వీయ అనుభవం ఇది!

ముగ్గు పెట్టడం వెనుక ఆశ్చర్యపోయే విషయాలున్నాయని అంటున్నారు తమిళనాడుకు చెందిన భార్గవి. అసలు ఈ ముగ్గేమిటి? దాని వెనుకున్న కథా కమామిషేమిటి? ఈ భార్గవి ఎవరూ? ముందుగా ఈ చిన్న కథ తెలుసుకోవాలి.

ఇది వరకు తెలుగు లోగిళ్లు ముగ్గులతో కళకళలాడేవి. పెద్ద పెద్ద వాకిళ్లు, వాకిలి నిండా ముగ్గులు ఇంటికి ఎంతో అందాన్నిచ్చేవి. అయితే ఇప్పుడు ముగ్గు పెట్టుకుందామంటే వాకిళ్లు లేవు. ఒకవేళ ఉన్నా అక్కడ అందంగా ముగ్గేసుకునే ఓపిక, సమయం మనకు లేవు. ఏదో పనిమనిషి ఊడ్చేసి, కల్లాపి చల్లి తనకు నచ్చిన రెండు గీతలు ముగ్గులా గీసేసి అయ్యిందనిపించడమే తప్ప రోజూ ముగ్గు పెట్టే వాకిళ్లు చాలా తక్కువ ఈ రోజుల్లో. పాత సంప్రదాయాల్లో ఏదో ఒక మంచి రీజన్ లేకుండా ఉండనే ఉండదు. అది మనం తెలుసుకున్నాక ఇంతుందా అనుకుంటాం. అలాంటిదే భార్గవి అనే యువతి స్వీయ అనుభవం కూడా.

భార్గవి కూడా మనందరిలాగే ఆధునిక భావాలతో, చదువుల్లో బీజిగా గడిపిన అమ్మాయే. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ మలచుకునే దిశలో ఉంది. కెరీర్ గాడిలో పడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒకరోజు ఆమె జీవితం తలకిందులైంది. ఒక పెద్ద కార్ ఆక్సిడెంట్ లో ఆమె తలకు దెబ్బతగిలింది. ఫలితంగా గడిచిన పది సంవత్సరాల్లో జరిగిన దాదాపు అన్ని విషయాలు మరచిపోయింది. గజిని సినిమాలో మాదిరిగా మెమొరీ లాస్ అన్నట్టు. ఆమె జీవితమే మారిపోయింది. పది సంవత్సరాలుగా పరిచయమున్న ఎవరినీ గుర్తుపట్టలేకపోయింది. చదువుకున్న చదువు కూడా దాదాపుగా మరచిపోయింది. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ గా ఉన్న ఆమె కెమెరా ఎలా వాడాలో కూడా మరచిపోయింది.

ఆమె కుటుంబ సభ్యులు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎంతోమంది డాక్టర్లను కూడా కలిశారు. కానీ పెద్ద ఫలితం కనిపించలేదు. కానీ వాళ్ల అమ్మ తన నమ్మకాన్ని వదులుకోలేదు. ఆమె చిన్ననాటి విషయాలన్నీంటిని ఆమెకు చెబుతూ గుర్తుచేసే ప్రయత్నం చేశారంట. భార్గవికి స్కూల్ రోజుల్లో ఇంటి ముందు ముగ్గు వేసే అలవాటు ఉండేదట. ఇష్టపడి ముగ్గు వెయ్యడం నేర్చుకుందట. వాళ్ల నాన్న పొద్దున్న వాకింగ్‌కు వెళ్లడానికి ముందే ముగ్గువేసేదట. ఆ విషయాన్ని వాళ్లమ్మ గుర్తుచేస్తే ఆమెకు తిరిగి ముగ్గు పెట్టాలనే ఆలోచన మొదలైందని, అలా చుక్కులు, పెట్టడం వాటిని కలపడానికి ఆమె మానసికంగ చేసిన శ్రమ వల్ల ఆమె మెదడు కణాలు రెజువనేట్ అయ్యి నెమ్మదిగా ఆమెలో మార్పు రావడం మొదలైంది.

చుక్కలు, గీతల ఈ కళారూపం చాలా పాతది. దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ముగ్గులో దాగున్న సైంటిఫిక్ విషయాల గురించి తెలుసుకున్నపుడు ఆశ్చర్యపోక తప్పదు. చుక్కులను సిమెంట్రిక్ గా అమర్చడం వాటిని అందంగా కలపడం అనే ప్రక్రియ మ్యాథ్స్ ప్రాక్టీస్ కంటే తక్కువ కాదని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల భార్గవి తన మెదడు కణాలను తిరిగి స్టిమ్యూలేట్ చేసుకోగలిగింది. ఒకటి రెండు కాదు పదేళ్ల జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకోగలిగింది.

మెమొరీ లాస్ వల్ల ఆమె చాలా కష్ట పడేది. మనుషులను గుర్తుపట్టలేకపోవడం, ఏదీ సరిగా అర్థం కాకపోవడం. ఎవరో ఒకరి సహకారం లేకుండా కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా తాగేందుకు ఇబ్బంది పడేదని, అంతా అయిపోయింది ఇక ఈ జీవితానికి ఒక అర్థం లేదనే భావన నుంచి తాను ఇప్పుడు జీవిత పరమార్థం దిశగా ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చింది. చిన్నపాపగా తాను నేర్చుకున్న ముగ్గు ప్రాధాన్యత అప్పుడు తాను తెలుసుకోలేదు.. కానీ ఇంత గొప్పగా పనిచేస్తుందని ఊహించలేకపోయానని చెబుతున్నారు భార్గవి.

ముగ్గుతో రోజు ప్రారంభించడం తిరిగి మొదలుపెట్టింది. ముగ్గుల గురించి మరింత సమాచారం కోసం ఆమె చాలా ప్రయత్నించింది కానీ ఆమెకు సరైన సమాచారమే దొరకలేదు. ముగ్గు గురించిన ఒక పద్ధతి కానీ, నేర్చుకునేందుకు శాస్త్రీయ విధానం కానీ లేదని ఆమె తెలుసుకుంది. ఎంతో ఉపయోగకరమైన ముగ్గు,  తమిళంలో కోలం అని పిలిచే ఈ కళారూపానికి ఒక గుర్తింపు ఉండాలని భావించి ఒక ముగ్గుల కోసం ఒక సంస్థనే నిర్వహిస్తోంది భార్గవి. దాని పేరు కోలం పొండు. ఈ సంస్థ ద్వారా రకరకాల సంప్రదాయల్లోని ముగ్గులను సేకరించారు. వాటిని ఎలా వేసుకోవాలో నేర్పిస్తారు కూడా. ఇందుకు కోలం డ్రాయింగ్ విడియోలు చేసి అందుబాటులో ఉంచారు. ఈ విడియోలు చూసి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ముగ్గు వేయడం నేర్చుకోవచ్చు.

ముగ్గువెయ్యడం నేర్పించడం ద్వారా ఈ కళారూపానికి ఒక గుర్తింపు తీసుకురావడం మాత్రమే కాదు, భార్గవి కోల్పోయిన తన జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకోగలిగారు. ముగ్గు వేస్తుండడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, మెదడు పనితీరు మెరుగవుతుంది. చివరగా వచ్చిన అందమైన ముగ్గు మనసుకు ఆహ్లాదంగా కూడా అనిపించి ఆనందం కూడా వస్తుందని భార్గవి చెబుతున్నారు. ఆమె దాదాపు 15 వందల ముగ్గులను సేకరించారట. ముగ్గేయ్యడం వల్ల సృజనాత్మకత పెరగడం, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడం వంటివెన్నో గమనించానని చెబుతున్నారు భార్గవి. అంతేకాదు ముగ్గెయ్యడం వేసిన ముగ్గును ప్రధర్శించడం అందరిని కలిపి ఉంచే ఒక దారం లాంటిదని ఆమె సమస్యను జయించిన ఆనందంలో అంటున్నారు. మరి ముగ్గేసే పని పనివాళ్లకు అప్పగించకుండా మనమే వేసుకోవడం వల్ల ఇలా లాభాలున్నాయట. ఇక చక్కగా ముగ్గులేసుకుందాం. అందరికీ ప్రదర్శిద్దాం.

Also Read: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget