Ayushman Bharat Digital Mission: డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభం.. ఒక్క ఐడీతో మీ వివరాలన్నీ..!
ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించారు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ వేదికగా ప్రారంభించారు. గత ఏడేళ్లుగా దేశంలోని వైద్య సదుపాయాలను మెరుగు పరుస్తున్న క్రమంలో మరో ముందడగు వేశామని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఇది ఓ కీలక దశగా మోదీ అభివర్ణించారు.
డిజిటల్ హెల్త్ ఐడీలు..
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ప్రతి భారతీయుడికీ హెల్త్ ఐడీ కేటాయిస్తామని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించారు.
Today is a very important day. The drive to strengthen the health facilities of the country, in the last 7 years, is entering a new phase today. This is not an ordinary phase. This is an extraordinary phase: PM Narendra Modi at the launch of Ayushman Bharat Digital Mission. pic.twitter.com/bX4NvsX6vA
— ANI (@ANI) September 27, 2021
ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పీఎండీహెచ్ఎం అమలవుతోంది. టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించడం కోసం కేంద్రం ఈ కార్యక్రమం చేపడుతోంది.
ఎలా పనిచేస్తుంది?
- ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్ కార్డ్‌లతో పాటు హెల్త్ ఐడీలను అందించనున్నారు.
- వీటి ఆధారంగా ప్రజలు తమ ఆరోగ్య సమాచారాన్ని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయలి.
- ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, ట్రీట్మెంట్ రికార్డ్‌లను పోగొట్టుకున్నా సంబంధిత సమాచారం ఈ వెబ్‌సైట్‌లో భద్రంగా ఉంటుంది.
- హెల్త్ ఐడీ చెబితే మన ఆరోగ్య వివరాలు మొత్తం తెలుస్తాయి.
వ్యాక్సినేషన్‌పై ప్రశంసలు..
దేశంలో ప్రస్తుతం సాగుతోన్న భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మోదీ ప్రశంసించారు. కొవిన్ ద్వారా వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రం కూడా అందిస్తున్నామని గుర్తుచేశారు.
Also Read:Bharat Bandh: దేశవ్యాప్తంగా 'భారత్ బంద్' ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్