అన్వేషించండి

Health Insurance Rejected: హెల్త్‌ పాలసీ ప్రీమియం ఏటా 50వేలు చెల్లించాడు! ఈ ఒక్క తప్పుతో ఆసుపత్రిలో చేరాక క్లెయిమ్‌ రిజెక్ట్ అయ్యింది!

Health Insurance Rejected: ఇప్పుడు హెల్త్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి అయిపోయింది. అయితే చిన్న చిన్న తప్పులు మాత్రం పెద్ద నష్టాన్ని మిగులుస్తాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాలసీ నిబంధనలు, వైద్య పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచన.

Health Insurance Rejected: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి మనిషికి హెల్త్, టర్క్‌ ఇన్సూరెన్స్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది వాటిని తీసుకుంటున్నారు. భారీగా ఖర్చు పెట్టి ఈ పాలసీలు తీసుకుంటున్నారు. కానీ అలా తీసుకున్న టైంలో చేసే చిన్న చిన్న పొరపాటులు తర్వాత పెద్ద నష్టాన్ని మిగులుస్తున్నాయి. అలాంటి ఓ కేసు గురించి ఇప్పుడు చూద్దాం. 

అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా ఇస్తుందనే లక్ష్యంతో హెల్త్ పాలసీని తీసుకుంటాం. అయితే అలాంటి పాలసీ సరైన సమయంలో మనకు పనికిరాకుండా పోతే ఎంత పెయిన్‌గా ఉంటుందో కదా. అలాంటి పరిస్థితిని ఫేస్ చేసిన ఓ వ్యక్తి తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇది వైరల్ కావడంతో దీనిపై బీమా కంపెనీ కూడా స్పందించాల్సి వచ్చింది. 

ఇటీవల ఓ వ్యక్తి తన తల్లి కోసం హెల్త్‌ పాలసీ తీసుకున్నాడు. సంవత్సరానికి సుమారు 50,000 రూపాయల ప్రీమియం చెల్లించాడు. కానీ అవసరమైన సమయాల్లో బీమా కంపెనీ సహాయం చేస్తుందని నమ్మకంగా ఉన్నాడు, కానీ చికిత్స సమయంలో, అతని క్లెయిమ్ తిరస్కరణకు గురైంది. ఆసుపత్రి బిల్ మొత్తం అతనే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఎక్స్‌లో చెప్పుకొచ్చాడు. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో తన కష్టాలను పంచుకుంటూ, ఆ వ్యక్తి కేవలం హెల్త్ పాలసీ తీసుకుంటే సరిపోతుందా లేదా క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు నిజమైన పోరాటం ప్రారంభమవుతుందా అని ప్రశ్నించాడు. ఆయన ఓ పాలసీ విషయంలో చాలా కష్టాలు పడ్డాడు. అందుకే అలా రాసుకొచ్చాడు. తన తల్లి హెల్త్ కోసం తీసుకున్న పాలసీని క్లెయిమ్ చేయడానికి స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ లక్నో కార్యాలయాన్ని కాంటాక్ట్ అయ్యాడు. అక్కడ గంటల తరబడి  ఎదురు చూడాల్సి వచ్చింది. తరువాత క్లెయిమ్ తిరస్కరణకు గురైంది. 

పాలసీ ఉన్నప్పటికీ క్లెయిమ్ రిజెక్ట్

పాలసీ కొనుగోలు చేసే ముందు ఈ విషయాలపై మీకు క్లారిటీ ఇవ్వలేదా అని కంపెనీ ప్రతినిధి చెప్పారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన తర్వాత, బీమా కంపెనీల రూల్స్, కనిపించకుండా దాచి పెట్టే విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చ తీవ్రమైంది. కంపెనీలు సకాలంలో ప్రీమియంలను ముక్కుపిండి వసూలు చేస్తాయని, కానీ క్లెయిమ్‌ల విషయంలో వారు ఎందుకు అంత కఠినంగా ఉంటారో అర్థం కాదని చాలా మంది వినియోగదారులు ప్రశ్నించారు.

కొందరు ఆరోగ్య బీమా ఇప్పుడు కాగితంపై ఉన్న వాగ్దానం మాత్రమే అని అన్నారు. మరికొందరు వినియోగదారులు ప్రభుత్వ నియంత్రణ సంస్థలను ట్యాగ్ చేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

క్లెయిమ్ ఎందుకు తిరస్కరణకు గురైంది

అయితే, కంపెనీ తన వాదన సోషల్ మీడియా ద్వారా వివరించింది. అందుబాటులో ఉన్న పత్రాలు, ధృవీకరించబడిన వైద్య రికార్డుల ఆధారంగా క్లెయిమ్‌ను రివ్యూ చేసి నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. పాలసీ పరిస్థితులు, వెయిటింగ్ పిరియడ్‌, ముందుగా ఉన్న అనారోగ్యం లేదా డాక్యుమెంటేషన్ లేకపోవడం వంటి కారణాలతో క్లెయిమ్‌లు తిరస్కరిస్తున్నట్టు పేర్కొది.

బీమా తీసుకునేటప్పుడు, పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవడం చాలా అవసరం. కవరేజ్ పరిమితులను అర్థం చేసుకోవడం ముఖ్యం. అన్ని వైద్య పత్రాలు సురక్షితంగా ఉంచుకోవాలి. పాలీ తీసుకునేటప్పటికే ఉన్న జబ్బులు, ఇతర వ్యాధుల వివరాలను కంపెనీకి తెలియజేయాలి. తద్వారా అవసరమైనప్పుడు క్లెయిమ్ ప్రక్రియలో ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు. 

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చెప్పిందంటే..

"ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు భావోద్వేగపూరితంగా సవాళ్లతో కూడుకున్నవిగా ఉండవచ్చని మేం గుర్తిస్తున్నాం. అయితే, లక్నో క్లెయిమ్‌కు సంబంధించిన అసంపూర్ణ, తప్పుదారి పట్టించేలా ఉండటంతో మేం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అందులో కీలకమైన వాస్తవాలు ప్రస్తావించలేదు. క్లెయిమ్ పరిశీలన సమయంలో అందుబాటులో ఉన్న వైద్య సమాచారం ప్రకారం, ఈ క్లెయిమ్‌కు సంబంధించిన ముందే అందుకు సంబంధించి మెడికల్ హిస్టరీ ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అవసరమైన ఆధార పత్రాలను అధికారికంగా కోరినప్పటికీ, అనుసరణ కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ అవి సమర్పించలేదు. నిర్ణయం పూర్తిగా పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం తీసుకున్నారు. అది డాక్యుమెంట్ ఆధారాలతో పూర్తిగా సమర్థించారని" స్టార్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది.

Frequently Asked Questions

క్లెయిమ్ తిరస్కరణకు గురైతే ఏమి జరుగుతుంది?

క్లెయిమ్ తిరస్కరణకు గురైతే, చికిత్సకు అయిన ఖర్చులన్నీ పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget