Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ లైఫ్.. చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్‌పై అయితే..!
ఒమిక్రాన్.. ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే మనుషుల చర్మంపై 21 గంటలకు పైగా, ప్లాస్టిక్ వస్తువులపై 8 రోజులకుపైగా జీవిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది.
ఒమిక్రాన్ వేరియంట్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది తాజా అధ్యయనం. ఈ కరోనా వేరియంట్ ఇంత వేగంగా వ్యాప్తి చెందటానికి ప్రధాన కారణాన్ని వెల్లడించింది. పలు ఉపరితలాలపై ఒమిక్రాన్ ఎక్కువ కాలం సజీవంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. కరోనా వైరస్ ఇతర రకాలతో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్.. మనుషుల చర్మంపై 21 గంటలకుపైగా, ప్లాస్టిక్ వస్తువులపై 8 రోజులకుపైగా జీవిస్తోందని ఈ అధ్యయనంలో తేలింది.
జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు వూహాన్లో ఉద్భవించిన సార్స్ కోవ్-2 వైరస్‌తో ఇతర అన్ని వేరియంట్లను పోల్చి చూశారు. అవి పర్యావరణంలో సజీవంగా ఉండే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇతర రకాల కన్నా.. ఒమిక్రాన్ వేరియంట్‌కు ఎక్కువ కాలం జీవించే సామర్థ్యం ఉందని తేల్చారు. ఈ అధ్యయనం బయోఆర్షివ్లో ఇటీవల ప్రచురితమైంది.
ఏది.. ఎక్కడ.. ఎన్ని గంటలు?
ప్లాస్టిక్ ఉపరితలంపై వైరస్ జీవించే సామర్థ్యం ఒరిజినల్ వేరియంట్ (56 గంటలు).
- ఆల్ఫా (191.3 గంటలు)
- బీటా (156.6 గంటలు)
- గామా (59.3 గంటలు)
- డెల్టా(114 గంటలు)
- ఒమిక్రాన్ వేరియంట్ అత్యధికంగా ప్లాస్టిక్ వస్తువులపై 193.5 గంటలు సజీవంగా ఉంటుంది.
చర్మంపై..
చర్మంపై ఉన్న వివిధ వేరియంట్ శాంపిళ్లను కూడా స్టడీ చేశారు. ఒరిజినల్ వైరస్ చర్మంపై 8.6 గంటలు సజీవంగా ఉంటుంది.
- ఆల్ఫా (19.6 గంటలు)
- బీటా (19.1 గంటలు)
- గామా (11 గంటలు)
- డెల్టా (16.8 గంటలు)
- డెల్టా వేరియంట్ (21.1 గంటలు)
- ఒమిక్రాన్ (21 గంటలు)
భారత్‌లో..
భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఈరోజు కాస్త పెరిగింది. తాజాగా 2,85,914 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 665 మంది మరణించారు. 2,99,073 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసులు 4 కోట్లు దాటాయి.
Also Read: Republic day 2022: వాయుసేన శకటంతో 'శివాంగి' కవాతు.. రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్ విశేషాలివే!
Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..