Republic day 2022: వాయుసేన శకటంతో 'శివాంగి' కవాతు.. రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్ విశేషాలివే!
రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్.. వాయుసేన శకటంతో కవాతులో పాల్గొన్నారు. ఇంతకీ శివాంగి సింగ్ ఎవరు?
భారత 73వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో పరేడ్ ఆకట్టుకుంది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పరేడ్‌లో సైన్యం, వాయుసేన, నావికాదళం, కేంద్ర పారాబలగాలు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు భాగమయ్యాయి. పలు ఆయుధ వ్యవస్థలు, యుద్ధట్యాంకులు, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది. అయితే ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.. రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్.
#RepublicDayParade | Indian Air Force tableau displays the theme 'Indian Air Force Transforming for the future'. It showcases scaled-down models of MiG-21, Gnat, Light Combat Helicopter (LCH), Aslesha radar and Rafale aircraft. #RepublicDay pic.twitter.com/t1iaU7OsTX
— ANI (@ANI) January 26, 2022
శివాంగి సింగ్.. భారత వాయుసేన శకటంతో పాటు కవాతులో పాల్గొన్నారు. ఐఏఎఫ్ శకటం పరేడ్‌లో భాగమైన రెండో మహిళా ఫైటర్ జెట్ పైలట్‌గా శివాంగి రికార్డ్ సృష్టించారు. గతేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్.. పరేడ్‌లో పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఫైటర్ జెట్ పైలట్‌గా నిలిచారు.
ఎవరీ శివాంగి..
- శివాంగి సింగ్.. వారణాసిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
- బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు.
- 7 యూపీ ఎయిర్ స్క్వాడ్రన్‌లో ఎన్‌సీసీ క్యాడెట్‌గా శివాంగి ఉన్నారు.
- శివాంగి 2016లో ఐఏఎఫ్‌కి ఎంపికయ్యారు.
- 2017లో ఏర్పాటైన రెండో మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో ఈమె ఓ సభ్యురాలు.
- హైదరాబాద్‌లో శిక్షణ పూర్తయ్యాక రాజస్థాన్ సరిహద్దులోని వైమానిక స్థావరంలో విధుల్లో చేరారు.
- ఇక్కడే వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వద్ద శిక్షణ పొందే అవకాశం శివాంగికి దొరికింది.
- మిగ్-21ను నడపడంలో శివాంగి అసాధారణ ప్రతిభాపాటవాలను ప్రదర్శించడంతో రఫేల్ నడిపే అర్హతను ఆమె సాధించారు.
- రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా శివాంగి సింగ్ రికార్డ్ సృష్టించారు.
Also Read: Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు