Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022
Republic Day 2022 Celebration: భారత్ సర్వసత్తాక, గణతంత్ర రాజ్యమని చాటిచెప్పడం మన రాజ్యాంగ ముఖ్య ఉద్దేశం. ఇందులో మరెన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.
Interesting Facts About Indian Constitution: నేడు భారతావని 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. ఎందుకంటే సరిగ్గా ఇదేరోజు జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. బ్రిటీష్ వారి నియమాలు కట్టుబాట్లను తెంచుకుంటూ దేశానికి సరైన మార్గనిర్దేశం చేసే రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949లో ఆమోదించారు. 1930, జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం కారణంగా జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. రాజ్యాంగం విశేషాలు ఏంటంటే భారత్ సర్వసత్తాక, గణతంత్ర రాజ్యమని చాటిచెప్పడం. ప్రజలందరూ సమానమేనని, అందరికీ అన్ని రంగాల్లో అవకాశాలు, సమన్యాయం లాంటి అంశాలను ఇందులో చేర్చారు. రాజ్యాంగ నిర్మాతగా బీఆర్ అంబేడ్కర్‌ను వ్యవహరిస్తారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని విశేషాలు మీకోసం...
ఈ సారి భారత గణతంత్ర వేడుకల్లో ఎంతో ప్రత్యేకత కనిపించనుంది. ప్రధానంగా ప్రధాన కవాతులో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ద్వారా 'షాహీదోన్ కో షట్ షట్ నమన్' కార్యక్రమాన్ని ప్రదర్శిస్తారు. భారత వైమానిక దళానికి చెందిన 75 విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ప్రదర్శన ఉంటుంది. దేశవ్యాప్తంగా వందేభారతం నృత్య పోటీ ద్వారా ఎంపికైన 480 మంది నృత్యకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. 'కలా కుంభ్' ఈవెంట్ సమయంలోనూ అందరికీ ఆ అనుభూతి అందేలా ఏర్పాట్లు చేశారు. వేడుకలను చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు మెరుగైన వీక్షణ అనుభవం కోసం 10 పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రొజెక్షన్ మ్యాపింగ్‌తో పాటు 'బీటింగ్ ది రిట్రీట్' వేడుక కోసం 1,000 దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్‌ల ద్వారా డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేశారు.
1. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది.
2. 1946లో ఏర్పాటైన భారత రాజ్యాంగ సభ, స్వతంత్ర్య భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించాలని నిర్ణయం తీసుకుంది.
3. భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉండగా, ముసాయిదా కమిటీకి అంబేద్కర్ చైర్మన్‌గా ఉన్నారు.
4. భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఏకంగా 2 సంవత్సరాల, 11 నెలల మరియు 18 రోజులు పట్టింది. ఇందుకోసం 165 రోజుల వ్యవధిలో 11 సార్లు రాజ్యాంగ సభ సమావేశమైంది.
5. రాజ్యాంగం కోసం ముసాయిదా కమిటీ చర్చల సమయంలో మొత్తం 7,635 సవరణలు సమర్పించింది. చర్చల అనంతరం రాజ్యాంగ సభ కమిటీ 2,473 వరకు ప్రతిపాదనల్ని తొలగించింది.
6. భారత రాజ్యాంగం 26 నవంబర్, 1949న ఆమోదం పొందింది. ముసాయిదా డ్రాఫ్ట్‌పై 284 మంది పార్లమెంటు సభ్యులు సంతకం చేశారు.
7. ఆమోదం పొందిన రోజు చినుకులు కురవడంతో అది దేశ ప్రజలకు శుభసూచకమని పేర్కొన్నారు.
8. ముందు ఏడాది నవంబర్‌లో ఆమోదం పొందిన భారత రాజ్యాంగాన్ని జనవరి 26, 1950న అమల్లోకి తెచ్చారు. తద్వారా రాజ్యాంగ పరిషత్ ఉనికిలో లేకుండా పోయింది. 1952లో కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు దేశానికి తాత్కాలిక పార్లమెంట్‌గా రాజ్యాంగ పరిషత్ వ్యవహరించింది.
9. బ్రిటన్, అమెరికా, జపాన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ మరియు కెనడా లాంటి 10 ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి భారత రాజ్యాంగంలో కొన్ని విషయాలను తీసుకున్నారు.
10. భారతదేశ అసలైన అసలైన రాజ్యాంగం చేతితో వ్రాసిన ప్రపంచంలోని అతిపెద్ద పత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇంగ్లీష్‌లోకి అనువదించగా మొత్తం 1,17,369 పదాలు ఉన్నాయి.
11. అప్పట్లో చేతితో వ్రాసిన రాజ్యాంగం కాపీలు ప్రస్తుతం పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో హీలియం కేస్‌లలో భద్రపరిచారు.
12. ఎమర్జెన్సీ సమయంలో 42వ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’ అనే పదాన్ని చేర్చారు. ఇప్పటివరకూ రాజ్యాంగ పీఠిక (Preamble)లో చేసిన ఏకైక సవరణ ఇది.
Also Read: Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?
Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..