అన్వేషించండి

Cancer: మగవారికే ఎక్కువ క్యాన్సర్ ముప్పు, కారణాలు ఇవే

క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. దీన్నే మొదటి స్టేజీలోనే గుర్తించి చికిత్స చేసుకోవాలి.

ఆడవారికన్నా మగవారికే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. దానికి కారణం వారికున్న చెడు అలవాట్లే. బయట ఆహారాన్ని అధికంగా తినేది మగవారే. అలాగే సిగరెట్లు, గుట్కా, ఆల్కహాల్ అధికంగా తాగడం వంటి అలవాట్లు కూడా వీరికే ఎక్కువగా ఉంటాయి. పై అలవాట్లన్నీ క్యాన్సర్ కారకాలనే చెప్పాలి. అలాగే ఉద్యోగపరమైన ఒత్తిళ్లు,ఇంట్లో ఆర్ధిక ఒత్తిళ్లు కూడా వీరికే ఎక్కువ. ఈ ఒత్తిళ్లు కారణంగా కూడా కొన్ని దురలవాట్లు వీరికి వస్తాయి. వాటి వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. భారతదేశంలోని మగవారు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల బారిన అధికంగా పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నోరు, అన్నవాహిక, పెద్ద పేగు, పొట్ట, ఊపిరితిత్తులు వంటి వాటికి వీరు ఎక్కువగా గురవుతున్నారు. కాస్త వయసు పెరిగాక ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన కూడా అధికంగా పడుతున్నారు, కాబట్టి మగవారు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

యాభై ఏళ్లు పైబడిన వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ వయసు దాటాక ఏడాదికి ఒకసారైనా ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ వంటి  పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మొదటి స్టేజీలోనే క్యాన్సర్ ముప్పును పసిగడితే చికిత్స కూడా సులభంగా మారుతుంది. క్యాన్సర్ ఏదైనా సరే కొన్ని రకాల లక్షణాలు కామన్‌గా ఉంటాయి. అవి కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

1. హఠాత్తుగా బరువు తగ్గడం
2. తినాలనిపించకుండా ఆకలి తగ్గడం
3. జ్వరం తరచూ వస్తూ పోతూ ఉండడం
4. మూత్రంలో రక్తం కనిపించడం
5. మలవిసర్జనలోనూ రక్తం కనిపించడం
6. అజీర్తి అధికంగా ఉండడం 
7. గొంతునొప్పి
8. ఆహారం మింగితే గొంతులో నొప్పి రావడం
9. నోటిలో పుండ్లు
10. ఎముకలు నొప్పి పెట్టడం

పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి. ఇవన్నీ సాధారణంగా కనిపించేవే అని నిర్లక్ష్యం వహిస్తే సమస్య ముదిరిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మగవారిలో కనిపించే ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్ద పేగు, ప్రొస్టేట్, పొట్ట, నోరు, అన్నవాహిక క్యాన్సర్లకు ముందస్తు హెచ్చరికలుగా చెప్పుకోవచ్చు. పై లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.  

Also read: చలికాలంలో ఇంట్లో కచ్చితంగా ఉండాల్సి నీలగిరి తైలం, ఆ మందుల్లో వాడేది ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Embed widget