అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Diabetes Sexual Dysfunction: డయాబెటీస్ సెక్స్‌పై ప్రభావం చూపుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

డయాబెటీస్ ఉంటే సెక్స్ చేయడం కష్టమా? లైంగిక సమస్యలు తలెత్తుతాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటీస్ బాధితులు కూడా సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు?

Diabetes Intercourse | ‘సెక్స్’ అనేది ఆరోగ్యాన్ని అందించే ఔషదం. రోజూ శరీరానికి వ్యాయమం ఎంత ముఖ్యమో.. సెక్స్ కూడా అంతే ముఖ్యం. నిత్యం సెక్స్‌ను ఎంజాయ్ చేసేవారి శరీరానికి మంచి వ్యాయమం లభిస్తుంది. దానివల్ల డయాబెటీస్‌ను కూడా వారు కంట్రోల్ చేయవచ్చు. అయితే, డయాబెటీస్ వల్ల సెక్స్ లైఫ్‌కు చాలా ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయి. అలాగే, సెక్స్ చేస్తున్నప్పుడు సుగర్ స్థాయిలో పడిపోయి వెంటనే నీరసించేపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి, డయాబెటీస్ సెక్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? దీనిపై నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం. 

సెక్స్.. రక్త పోటు, ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే, మీకు టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లయితే.. సెక్స్ అంత గొప్ప అనుభూతిని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే, సెక్స్ వల్ల బోలెడంత ఎనర్జీ ఖర్చవుతుంది. దాని వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పడిపోతాయి. దీంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ అయినట్లు వెనక్కి తగ్గాల్సిందే. అయితే, కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీరు సెంచురీలు కొట్టవచ్చు. సెక్స్‌ను డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే ఔషదంగానూ మార్చేసుకోవచ్చు. 

డయాబెటీస్ రోగుల సెక్స్ లైఫ్‌లో ఏర్పడే సమస్యలు, వాటిని ఎదుర్కోడానికి పాటించాల్సిన చిట్కాలపై ఎండోక్రినాలజిస్ట్ నిపుణులు తెలిపిన వివరాలివే: 
⦿ మధుమేహం రోగులకు క్రమేనా సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. అలాగే అంగస్తంభన సమస్యలు కూడా వేదిస్తాయి. 
⦿ డయాబెటీస్ ఉండే మహిళల్లో కూడా సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతాయి.
⦿ మధుమేహం లైంగిక బలహీనత ప్రమాదాన్ని పెంచుతుంది.
⦿ డయాబెటీస్ వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, స్లీప్ అప్నియా, డిప్రెషన్ ఏర్పడుతుంది. ఇవి అంగస్తంభనపై ప్రభావం చూపుతాయి.
⦿ స్థూలకాయం అంగస్తంభనపై ప్రభావం చూపుతుంది. 
⦿ స్లీప్ అప్నియా వల్ల మహిళల్లో కూడా లైంగిక సమస్యలకు కారణమవుతుంది.  
⦿ డయాబెటీస్‌కు వాడే మందుల వల్ల కూడా లైంగిక సమస్యలు ఏర్పడవచ్చు. 
⦿ మధుమేహం వల్ల ఏర్పడే పరిస్థితులు మానసిక ఆందోళనకు దారితీయొచ్చు. అది లైంగిక ఆసక్తిని తగ్గించవచ్చు.
⦿ మానసిక ఆందోళన, డిప్రషన్ కోసం ఉపయోగించే మందులు కూడా లైంగిక సమస్యలకు కారణం కావచ్చు. 
⦿ టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్‌లో మార్పులు కూడా లిబిడో, లూబ్రికేషన్, లైంగికం సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు.
⦿ మధుమేహం పురుషాంగం లేదా యోనిలో చేరే రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. 
⦿ రక్త ప్రవాహం సక్రమంగా ఉన్నప్పుడే అంగస్తంభన సక్రమంగా ఉంటుంది. 
⦿ మహిళల్లో రక్త ప్రసరణ తగ్గితే యోని పొడిగా మారుతుంది. 
⦿ అధిక రక్తపోటు మందులు కూడా అంగస్తంభనపై ప్రభావం చూపవచ్చు.
⦿ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే  నరాలు దెబ్బతింటాయి. 
⦿ పురుషాంగం చివరి కొన, స్త్రీ యోని గోడలు నరాలతో నిండి, ఎంతో సున్నితంగా ఉంటాయి. అవి దెబ్బతింటే లైంగిక అనుభూతి తగ్గిపోతుంది. లేదా సెక్స్ బాధాకరంగా ఉంటుంది.

గుడ్‌న్యూస్.. ఈ సమస్య అందరిలో ఒకేలా ఉండదు: 
⦿ పైన చెప్పిన సమస్యలు ప్రతి మధుమేహ రోగిలో ఉండకపోవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. 
⦿ డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకొనేవారిలో ఈ సమస్యలు చాలా తక్కువ. కానీ, నియంత్రణ కోల్పోతేనే అసలు సమస్య.
⦿ డయాబెటిక్స్ ఆ సమస్యను గుర్తించిన మొదట్లోనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ, కొందరు ముదిరిన తర్వాత చెబుతారు.
⦿ ఓ అధ్యయనం ప్రకారం.. 80% మంది రోగులు లైంగిక పనితీరు గురించి డాక్టర్‌కు చెప్పడం ఇష్టం లేదని పేర్కొన్నారు.

ఈ టిప్స్ పాటించడం ద్వారా డయాబెటీస్ రోగులు సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు:
❤ డయాబెటీస్ కోసం మీరు ఇన్సులిన్ ఉపయోగిస్తున్నట్లే సెక్స్‌కు ముందు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయండి. 
❤ సెక్స్‌కు ముందు కొద్దిగా ఆహారాన్ని తీసుకోండి. 
❤ సెక్స్ చేసేప్పుడు మధ్యలో మధ్యలో చాక్లెట్ నోట్లో పెట్టుకోండి. ఇది రొమాన్స్‌ను కూడా స్వీట్‌గా మార్చేస్తుంది.
❤ ఫొర్ ప్లేలో ఐస్‌క్రీమ్, స్ట్రాబెర్రీ లేదా చాకెట్లను ప్రయత్నించండి.
❤ సెక్స్ చేస్తునప్పుడు చెమటలు అతిగా పడుతుంటే సుగర్ డౌన్ అవుతున్నట్లు లెక్క. ఆ సమయంలో చాక్లెట్ చప్పరించవచ్చు. 
❤ డయాబెటీస్ వల్ల మహిళల యోని పొడిబారితే ఏదైనా లూబ్రికెంట్‌ను వాడండి. 
❤ సరైన సెక్స్ కోసం ముందుగానే మీ బెడ్ వద్ద  జ్యూస్ లేదా గ్లూకోజ్ మాత్రలు సిద్ధం చేసుకోండి. స్త్రీలు లూబ్రికెంట్ దగ్గర పెట్టుకోవాలి.
❤ డయాబెటీస్ ఉందనే ఆలోచన బుర్రలో ఉంటే సెక్స్ చేయలేరు. అన్ని జాగ్రత్తులు తీసుకొని సెక్స్ చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని మరిచిపోండి. 

Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు

❤ బెడ్ వద్ద గ్లూకోజ్ మానిటర్ (CGM)ని పెట్టుకోవడం మంచిది. 
❤ డయాబెటీస్ ఉన్నా సరే కొందరు ఎక్కువ సేపు సెక్స్ చేయగలరు. అలాంటివారు ఆవేశంగా కూడా, నెమ్మదిగా సెక్స్‌ను ఆస్వాదించాలి.
❤ లైంగిక ఆసక్తి తగ్గుతున్నట్లయితే కొత్త ప్రాంతాల్లో సెక్స్ చేయడానికి ప్రయత్నించండి. అది కొత్తగా, క్రియేటివ్‌గా ఉంటుంది. 
❤ మీకు అంగస్తంభన సమస్య ఉన్నట్లయితే వైద్యుడి సలహా తీసుకోండి.
❤ డయాబెటీస్ ఉన్నవారు వ్యాయమం చేయడం ద్వారా చక్కెర స్థాయిలు తగ్గించుకోవచ్చు. కాబట్టి, సెక్స్‌ను కూడా చక్కని వ్యాయమంగా భావిస్తూ ఆస్వాదించండి.
❤ మీ భర్త లేదా భార్యకు డయాబెటీస్ ఉన్నట్లయితే అస్సలు నిరుత్సాహానికి గురిచేయొద్దు. వారు సెక్స్‌లో విఫలమైతే అవహేళన చేయకుండా మంచిగా ఎలా సెక్స్ చేయవచ్చో చెప్పండి. 

Also Read: ఈ వయాగ్రా ఖరీదు కిలో రూ.70 లక్షలు, దీని కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లెందరో

గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణుల సూచనలను ఈ కథనంలో యథావిధిగా అందించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. డయాబెటీస్ వంటి వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా వైద్యుడి సూచనలు తీసుకోవాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Embed widget