Himalayan Vayagra: ఈ వయాగ్రా ఖరీదు కిలో రూ.70 లక్షలు, దీని కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లెందరో
హిమాలయాల్లో దొరికే ఒక రకమైన ఔషధం కోసం ఏటా వందలాది మంది ప్రాణాలను పణంగా పెడతారు.
యర్సగుంబా... ఇది హిమాలయాల్లో దొరికే వయాగ్రా. దీని వాడితే లైంగిక సామర్థ్యం పెరగడమే కాదు, క్యాన్సర్, ఆస్తమా వంటివి కూడా తగ్గుతాయని అంటారు వైద్యులు. అందుకే దీనికి మార్కెట్లె భారీ రేటు పలుకుతుంది. కేవలం ఒక గ్రాము యర్సగుంబా ఏడు వేల రూపాయల దాకా ఉంటుంది. అంటే కిలో రూ.70 లక్షలన్నమాట. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. హిమాలయ పర్వతాల్లో మూడు వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో మాత్రమే దొరుకుతాయి. అమెరికా, చై మంమబనా, మయన్మార్, సింగపూర్, థాయ్ లాండ్, జపాన్ వంటి దేశాలు అధికంగా వీటిని దిగుమతి చేసుకుంటాయి. కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే ఇవి లభిస్తాయి.
అసలేంటివి?
హియాలయపర్వతాలపై కొన్ని రకాల గొంగళి పురుగులు పెరుగుతాయి. వాటికి ఒకరకమైన ఫంగస్ సోకుతుంది. దాని కారణంగా అవి మరణిస్తాయి. అలా మరణించిని గొంగళిపురుగులే యర్సగుంబా. వీటిని హియాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ఇవే జీవనోపాధి. వీటి కోసం అంతెత్తు పర్వతాలు ఎక్కుతారు. ఒక్కోసారి మంచుచరియలు విరిగిపడి మరణిస్తారు. మరికొందరు దారితప్పి ఇరుక్కుని, ఆహారం లేక చనిపోతారు. అలా చనిపోయిన వారి సంఖ్య అధికంగానే ఉన్నా కూడా అక్కడి ప్రజలు వీటిని ఏరే పని మాత్రం మానరు. ఆడామగా తేడా లేకుండా స్థానిక ప్రజలు పర్వతాలెక్కి వాటిని ఏరి వ్యాపారస్తులకు అమ్ముతారు. వాటిని వ్యాపారులు ఎగుమతి చేస్తారు.
లైంగిక ఆరోగ్యానికి...
యర్సగుంబా లైంగిక కోరికలు పెంచేందుకు, లైంగిక సమస్యలను తొలగించేందుకు ఔషధంలా వాడుతారు. చైనా, హాంకాంగ్ దేశాల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. వీటిని టీ, వేడి నీళ్లు, వివిధ రకాల సూప్‌లలో కలుపుకుని తాగుతారు. ఎన్నో ఆరోగ్యసమస్యలకు ఇది చెక్ పెట్టగలదు. అలాగే క్యాన్సర్ చికిత్సకు కూడా కొన్ని దేశాల్లో వాడతారు. వీటి స్మగ్మింగ్ కూడా భారీగానే జరుగుతోంది. ఈ గొంగళిపురుగుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. అందుకే వీటిని ఇంటర్నేషనల్ నేచర్ కన్జర్వేషన్ అసోసియేషన్ ‘రెడ్ లిస్టు’లో పెట్టింది. అంటే భవిష్యత్తులో ఇవి అంతరించిపోయే అవకాశం ఉంది.
Also read: పిప్పి పళ్లు కూడా వారసత్వంగా వస్తాయిట, అధ్యయనంలో షాకింగ్ ఫలితం
Also read: బరువు తగ్గేందుకు లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారా? ముందుగా వాటి దుష్ప్రభావాలేంటో తెలుసుకోండి
Also read: క్యాన్సర్ నుంచి తప్పించుకునేందుకు ఏంజెలీనా జోలీ ఆ పని చేసింది, కానీ అందరూ అలా చేయలేరు