అన్వేషించండి

HIV/AIDS Vaccine : HIV వ్యాప్తి కారకాలు.. ఈ వైరల్ జబ్బుకు వాక్సిన్ ఎందుకు కనుక్కోలేకపోయారో తెలుసా? రీజన్స్ ఇవే

Vaccine for HIV : HIV/AIDS ప్రాణాంతక అంటువ్యాధి. మరి ఇలాంటి వైరల్ జబ్బుకు ఎందుకు వాక్సిన్ కనుక్కోలేకపోయారో.. ఈ వ్యాధి వ్యాపికి కారకాలేంటో ఇప్పుడు చూసేద్దాం. 

Challenges in Developing an HIV/AIDS Vaccine : ప్రాణాంతక వ్యాధుల్లో HIV ఒకటి. దీనిబారిన పడితే కాస్త లేట్​ అయినా ప్రాణాలు పోవాల్సిందే. మరి ఇలాంటి అంటువ్యాధికి ఎందుకు ఇప్పటివరకు వాక్సిన్ కనుక్కోలేకపోయారో తెలుసా? కొత్తగా పుట్టుకొస్తున్న ఎన్నో వైరల్​ను అరికట్టి.. ప్రజలను రక్షించగలిగారు కానీ.. ఈ హెచ్​ఐవీ, ఎయిడ్స్​ కోసం వాక్సిన్ కనిపెట్టలేకపోయారు. దాని వెనుక రీజన్స్ ఏంటి? HIV/AIDS రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాప్తి కారకాలు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

వాక్సిన్ ఎందుకు కనుక్కోలేకపోయారంటే..

HIVకి క్యూర్ ఏమి లేదు. చికిత్సతో సమయాన్ని పెంచుకోవచ్చు కానీ.. ప్రాణాలు కాపాడలేము. చికిత్సలో భాగంగా antiretroviral therapy (ART) చేస్తారు కానీ.. ఇది వైరస్​ను మేనేజ్ చేయడానికే హెల్ప్ చేస్తుంది. నాశనం చేయడానికి కాదు. అంటువ్యాధి అయిన HIVకి టీకా కనుక్కోకపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

HIV/AIDSకి వ్యాక్సిన్ కనుక్కోవడం చాలా ఛాలెంజ్​తో కూడిన టాస్క్. ఇమ్యూనిటీపై ఎటాక్ చేసే ఈ వైరస్​కి చెక్​ పెట్టడానికి సైంటిఫిక్​గా ఎన్నో కారకాలు అడ్డువస్తున్నాయి. 

పరివర్తన : హెచ్​ఐవీ మ్యూటేషన్ రేట్ చాలా వేగంగా ఉంటుంది. ఈ వైరస్ ఈజీగా పరివర్తన చెందుతుంది. అంటే ఇది తన జెనిటిక్స్​ని చాలా త్వరగా మార్చేస్తుంది. దీనివల్ల వాక్సిన్​తో రోగనిరోధక శక్తిని బిల్డ్ చేయడం కష్టమవుతుంది. 

స్ట్రైన్స్ ఎక్కువ : ఈ వైరస్​లో అనేక రకాల జాతులు ఉన్నాయి. వాటన్నింటిని రక్షించగలిగే సింగిల్ వ్యాక్సిన్​ని అభివృద్ధి చేయడం కష్టతరంగా ఉన్నట్లు నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

DNAలోకి జెనిటిక్స్ : వాక్సిన్ కనుక్కోలేకపోవడానికి ఇదో పెద్ద రీజన్. ఎందుకంటే HIVకి హోస్ట్ కణాలలో కలిసిపోయే సామర్థ్యం ఉంది. అంటే HIV తన జెనిటిక్ పదార్థాన్ని.. హెస్ట్ సెల్​ అయిన DNAలోకి చేర్చేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థను గుర్తించడం, వైరస్​పై దాడి చేయడం కష్టతరం అవుతుంది. 

ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్. అలాగే వాక్సిన్ కనుక్కోలేకపోవడానికి రోగనిరోధక(Immunological) రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే.. 

వైరస్ రెస్పాన్స్ : రోగనిరోధక వ్యవస్థపై హెచ్​ఐవీ ఎలా స్పందిస్తుందనేది తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. పరిశోధనలు గణనీయంగా జరుగుతున్నా.. వైరస్ రెస్పాన్స్​పై అవగాహన పరిమితంగానే ఉంది. 

ప్రతిరోధకాలు : శరీరంలో వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రతిరోధకాలు ప్రేరేపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. HIV కాంప్లెక్స్ ఎన్వలప్ ప్రోటీన్​ను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను తటస్థం చేసే యాంటీబాడీలను ఉత్పత్తి చేయడాన్ని కష్టం చేస్తుంది. 

ఒకవేళ HIVకి వాక్సిన్ కనుక్కోవాలంటే.. దానిలో యాంటీబాడీ హ్యూమరల్ సెల్, సెల్యూలార్ ఇమ్యూనిటీని పెంచేదై ఉండాలి. అలాగే టీకా భద్రత, సమర్థతను నిర్ధారించగలగాలి. HIV వ్యాక్సిన్​ క్లినకల్ ట్రయల్స్ పెద్ద ఎత్తున చేయాలి. అనంతరం వారు సురక్షితంగా, ప్రభావవంతగా ఉన్నారని గుర్తిస్తేనే వాక్సిన్​ను ప్రజలకు అందించాలి. ఇప్పటివరకు కొన్ని వాక్సిన్​లు కనుగొన్నారు కానీ.. వాటి ఫలితాలు కాస్త ఎఫెక్టివ్​గా మాత్రమే ఉంటున్నాయి. పూర్తిగా నయం చేసేవాటిపైనే ఇంకా రీసెర్చ్​లు జరుగుతున్నాయి. 

వ్యాప్తి కారకాలు ఇవే జాగ్రత్త

చాలామంది HIV లైంగికపరంగానే సంక్రమించే వ్యాధి అనుకుంటారు. కానీ ఇది చాలా రకాలు వ్యాపిస్తుంది. ముందుగా ప్రొటెక్షన్ లేకుండా పాల్గొనే లైంగిక చర్య ద్వారా ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఎయిడ్స్ ఉన్న వ్యక్తికి ఉపయోగించిన సిరంజీలు, ఇంజెక్షన్లు మరో వ్యక్తికి వినియోగించడం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. తల్లికి హెచ్​ఐవీ ఉంటే గర్భంలోని శిశువుకు కూడా ఇది వస్తుంది. బ్రెస్ట్​ ఫీడింగ్ ఇచ్చిన కూడా ఇది సోకుతుంది. అలాగే బ్లడ్ డొనేట్ చేసే వ్యక్తికి ఈ వైరస్ ఉంటే.. దానిని తీసుకున్న వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకుతుంది. 

హెచ్​ఐవీని కంట్రోల్ చేసేందుకు mRNA-based వాక్సిన్లను, వెక్టార్ బేస్డ్ వాక్సిన్లను, యాంటీబాండీ బేస్డ్ వాక్సిన్లపై ఇప్పుడు పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుకే వాక్సిన్​ వచ్చేలోపు ఈ వ్యాధిపై అవగాహనలు కల్పిస్తూ.. నియంత్రించేందుకు ఎయిడ్స్ డే నిర్వహిస్తున్నారు. 

Also Read :  ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024 థీమ్ ఇదే.. చికిత్సలేని ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం- రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Singapore: భార్యకు బంగారు చైన్ కొనిస్తే డ్రాలో రూ.8 కోట్ల లాటరీ తగిలింది - ఈ డబ్బులు భార్యవా ? భర్తవా ?
భార్యకు బంగారు చైన్ కొనిస్తే డ్రాలో రూ.8 కోట్ల లాటరీ తగిలింది - ఈ డబ్బులు భార్యవా ? భర్తవా ?
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Telugu Student Dies In US: అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి
అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Embed widget