News
News
X

Grapes: మండే ఎండల్లో రోజూ ఈ పండ్లను తింటే మీ చర్మం సేఫ్

ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండల వల్ల చర్మానికి హాని కలిగే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

వేసవి కాలం మొదలైపోయింది. మధ్యాహ్నం 12 గంటలు దాటకముందే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రోహిణి కార్తెలు మొదలయ్యాక, ఎండలు మామూలుగా ఉండవు.  మండే ఎండల్లో చర్మ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సూర్యకిరణాలు నేరుగా చర్మంపై తీవ్రస్థాయిలో తాకితే వివిధ రకాల వ్యాధులకు కారణం కావచ్చు. ఒక్కోసారి అతినీలలోహిత కిరణాల కారణంగా చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండలు మొదలవుతున్నప్పుడే చర్మ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే శరీరం మొత్తం కప్పే విధంగా వస్త్రధారణ ఉండాలి. అలాగే సన్ స్క్రీన్ లోషన్లను కూడా రాసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్లు పూర్తిగా రక్షణ కల్పించకపోయినా ఎంతోకొంత రక్షణను ఇస్తాయి.

ఎండల్లో చర్మ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని కూడా తినవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ద్రాక్ష పండ్లను తింటే చర్మానికి ఎంతో మంచిది. సూర్య కాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడినప్పుడు, వాటిని తట్టుకునే శక్తిని ద్రాక్ష పళ్ళు చర్మానికి ఇస్తాయి. ఈ విషయం ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది. ద్రాక్ష పండ్లలో ఫైటో కెమికల్స్ తో పాటు, రెస్వెరాట్రాల్ అని సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మానికి హాని కలగకుండా రక్షణ పొరలా ఉంటుంది. ద్రాక్ష పండ్లలో ఈ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వేసవికాలంలో చర్మం కోసం ప్రత్యేకంగా తినాల్సిన పండ్లు ద్రాక్ష. ఎరుపు, నలుపు, ఆకుపచ్చ ఇలా ఏ రంగులో ఉన్న ద్రాక్ష అయిన తింటే చర్మం కందిపోకుండా సూర్యకిరణాల నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాదు ద్రాక్షలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. కాబట్టి వడదెబ్బ బారిన పడకుండా శరీరానికి రక్షణ దొరుకుతుంది.

ద్రాక్షలో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే సామర్థ్యం ఉంది. మూత్రపిండాల పనితీరును బాగు చేయడంతో పాటు, కొన్నిరకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలను ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్లను రోజు తినాలి. ఈ ద్రాక్ష పండ్లను మూడు పూటలా తిన్నా కూడా ఎటువంటి నష్టం లేదు. ఎవరైతే ద్రాక్షలను అధికంగా తింటారో, వారికి వడదెబ్బ కొట్టే అవకాశం తగ్గుతుంది. అలాగే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది.

పుచ్చకాయ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లు కూడా శరీరానికి వేసవిలో ఆరోగ్యాన్ని అందిస్తాయి. నిమ్మరసం తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. 

Also read: జంక్ ఫుడ్ అంటే ఇష్టమా? అయితే ఆ కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 27 Feb 2023 11:08 AM (IST) Tags: Grapes Grapes in Summer Summer Fruites

సంబంధిత కథనాలు

ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవాలంటే రోజూ ఆ పదార్ధం తినాల్సిందే

ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవాలంటే రోజూ ఆ పదార్ధం తినాల్సిందే

Kids: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం

Kids: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం

World Autism Awareness Day: ఆటిజం అంటే ఏమిటి? పిల్ల‌ల్లో ఆటిజం ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?

World Autism Awareness Day: ఆటిజం అంటే ఏమిటి? పిల్ల‌ల్లో ఆటిజం ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?

Summer Foods: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం

Summer Foods: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం

Arthritis: ఈ భయంకరమైన లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు- ఆ ముప్పు బారిన పడిపోతారు

Arthritis: ఈ భయంకరమైన లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు- ఆ ముప్పు బారిన పడిపోతారు

టాప్ స్టోరీస్

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్