Covid 19 Vaccine: కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా సహా మరో 5 దేశాల అధికారిక గుర్తింపు
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాను మరో ఆరు దేశాలు అధికారికంగా గుర్తించాయి.
కరోనా టీకా కొవాగ్జిన్‌ను ఆస్ట్రేలియా సహా మరో ఐదు దేశాల ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించాయి. ఎస్తోనియా, కిర్గిజిస్థాన్, స్టేట్ ఆఫ్ పాలస్తైన్,, మారిషస్, మంగోలియా దేశాలు ఈ మేరకు కొవాగ్జిన్ గుర్తిస్తూ ప్రకటన విడుదల చేశాయి. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులకు తమ దేశాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉందని తెలిపాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
Mutual recognition of COVID-19 vaccination certificates continues!
— Arindam Bagchi (@MEAIndia) November 1, 2021
Five more recognitions for India’s vaccination certificate, including from Estonia, Kyrgyzstan, State of Palestine, Mauritius and Mongolia.
ముందుగా ఆస్ట్రేలియా..
కొవాగ్జిన్‌ను అధికారికంగా గుర్తిస్తూ ఈరోజు ఉదయం ఆస్ట్రేలియా ఔషధ, వైద్య పరికరాల నియంత్రణ సంస్థ- థెరపీటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
కొవాగ్జిన్, చైనా సినోఫార్మ్ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ కరోనా వ్యాక్సిన్లను అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. పూర్తి స్థాయిలో కొవాగ్జిన్ టీకా తీసుకున్న 12 ఏళ్లు పైబడిన వారు, బీబీఐబీపీ టీకా తీసుకున్న 18-60 ఏళ్ల మధ్య వయస్సుల వారు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను ఆస్ట్రేలియా ఇప్పటికే అధికారికంగా గుర్తించింది.
కొవాగ్జిన్ టీకాను డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. అయితే నిపుణుల కమిటీ వద్ద ఇది పెండింగ్‌లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం చాలా రోజుల నుంచి కొవాగ్జిన్‌ను తయారు చేసిన భారత్ బయోటెక్, భారత్ ఎదురుచూస్తోంది.
Also Read: 2013 Patna Gandhi Maidan Blasts: 'మోదీ సభలో బాంబు దాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష ఖరారు
Also Read: UP CM Yogi Adityanath: తాలిబన్లకు తనదైన స్టైల్‌లో యోగి వార్నింగ్.. 'భారత్ వైపు చూస్తే వైమానిక దాడే'
Also Read: Rakesh Tikait: కేంద్రానికి రాకేశ్ టికాయత్ అల్టిమేటం.. ఆ తేదీ లోపు రద్దు చేయకపోతే..!
Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు
Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు