News
News
వీడియోలు ఆటలు
X

రోజంతా ఫోన్లు, లాప్‌టాప్, టీవీలతో గడిపేస్తున్నారా? మీరు త్వరగా ముసలోళ్లు అయిపోతారు!

అధిక శక్తి కలిగిన బ్లూలైట్ వల్ల కళ్లు, చర్మం త్వరగా ఏజింగ్ అవడానికి కారణమవుతాయి. చర్మం సెల్ఫ్ రిపెయిర్ కెపాసిటి కూడా తగ్గిపోతుందని డెర్మటాలజిస్టులు అంటున్నారు.

FOLLOW US: 
Share:

నలో చాలా మంది నిద్ర లేవగానే చేసే మొదటి పని ఫోన్ చూడటమే. ఇక పని వేళ మొదలుకాగానే ఉండేది లాప్ టాప్ ముందే. సాయంత్రం కాసేపు టీవి చూడడం సాధారణంగా అందరిదీ ఇదే రొటీన్. అయితే ఈ పరికరాలన్నీంటి నుంచి వెలువడే కాంతిని బ్లూలైట్ అంటారు. వీటి నుంచి మాత్రమే కాదు బల్బుల నుంచి రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ప్రతి దానిలోనూ ఉండేది ఈ బ్లూలైటే. ఈ కాంతి తరంగధైర్ఘ్యం చాలా తక్కువగా ఉంటుంది.

ఫోన్లు, టాబ్ లు, లాప్ టాప్ ల నుంచి వచ్చే కాంతి నిద్రలేమికి మొదటి కారణంగా ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చిరిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఈ లైట్ నిద్రకే కాదు చర్మం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అధిక శక్తి కలిగిన ఈ బ్లూలైట్ వల్ల కళ్లు, చర్మం త్వరగా ఏజింగ్ అవడానికి కారణమవుతాయి. చర్మం సెల్ఫ్ రిపెయిర్ కెపాసిటి కూడా తగ్గిపోతుందని డెర్మటాలజిస్టులు అంటున్నారు.

2018 నాటి అధ్యయనంలో గంట పాటు బ్లూలైట్ కాంతిలో ఉన్నా కూడా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ అనే స్కిన్ ఏజింగ్ మాలీక్యూల్స్ ఉత్పత్తి అవుతాయని తేలింది. అయితే దీని గురించి మరింత సవివర పరిశోధన అవసరం ఉంది. బ్లూలైట్ వల్ల చర్మం మీద ముడతలు, నల్లని మచ్చలు వచ్చే ప్రమాదం ఉందని మాత్రం నిపుణుల హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన మెడికల్ ఆధారం లేదని కొన్ని రకాల చర్మ వ్యాధుల చికిత్సలో కూడా ఈ బ్లూలైట్ ను వాడుతన్నామని మరొకరు తమ అభిప్రాయాన్ని వెలువరించారు.

మరి చర్మాన్ని కాపాడుకునేది ఎలా?

పరిశోధనలు బ్లూలైట్ వల్ల నష్టం అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే చర్మాన్ని కాపాడుకునేందకు చాలా మార్గాలున్నాయి. చర్మానికి నేరుగా నష్టం కలిగించకపోయినప్పటికీ బ్లూలైట్ వల్ల నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది శరీరం మీద ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడి ప్రభావం చర్మం మీద కూడా ఉంటుంది.

కళ్లు ఉబ్బిపోవడం, చర్మం పాలిపోవడం, చర్మం పొడిబారడం, కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వంటి వాటికి నిద్ర లేమి కారణం అవుతుంది. ఫలితంగా చర్మం మీద ముడతలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

2019లో ఒక అధ్యయనం చాలా తక్కువ నిద్ర పోయే స్త్రీలు త్వరగా బ్రేక్ అవుట్ అవుతారు. అందువల్ల చర్మం మీద మచ్చలు రావచ్చని నిర్ధారిస్తోంది.

పని వేళల్లో లాప్ టాప్ వినియోగం మీద మీ నియంత్రణ పెద్దగా సాధ్యం కాకపోవచ్చు. కానీ సాయంత్రం టీవీ చూసే సమయం, ఫోన్ లో గడిపే సమయం తగ్గించడం వల్ల ముఖ కాంతిని ఎక్కువ కాలం పాటు నిలిపి ఉంచుకోవచ్చు.

విటమిన్ సి సీరమ్

చర్మ సంరక్షణలో తప్పనిసరిగా విటమిన్ సి చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. పొల్యూషన్ నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

చర్మం మీద సూర్యకాంతి ప్రభావం నేరుగా ఉంటుంది. దీనిని తగ్గించేందుకు బయటకి వెళ్లడానికి ముందు తప్పకుండా సన్ బ్లాక్ ను ఉపయోగించాలి. అయితే ప్రస్తుత కాలంలో బయటికి వెళ్లకపోయినా సరే తప్పని సరిగా సన్ స్క్రీన్ క్రీములను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 13 Apr 2023 11:59 AM (IST) Tags: Screen time Blue Light aging skin

సంబంధిత కథనాలు

Skin Cancer Test: స్మార్ట్ ఫోన్లతో చర్మ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? అదెలా?

Skin Cancer Test: స్మార్ట్ ఫోన్లతో చర్మ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? అదెలా?

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?